భారత్​లో 26/11 తరహా ఉగ్రదాడికి కుట్ర.. రంగంలోకి ఆ ఆరుగురు!-mumbai police received threat message claiming 26 11 like terror attack
Telugu News  /  National International  /  Mumbai Police Received Threat Message Claiming 26/11 Like Terror Attack
భారత్​లో 26/11 తరహా ఉగ్రదాడికి కుట్ర!
భారత్​లో 26/11 తరహా ఉగ్రదాడికి కుట్ర! (HT)

భారత్​లో 26/11 తరహా ఉగ్రదాడికి కుట్ర.. రంగంలోకి ఆ ఆరుగురు!

20 August 2022, 10:19 ISTSharath Chitturi
20 August 2022, 10:19 IST

Terror attack in India : పాకిస్థాన్​ ఆధారిత ఫోన్​ నెంబర్​ నుంచి ముంబై పోలీసులకు ఓ మెసేజ్​ వచ్చింది. 26/11 తరహాలో ఉగ్రదాడికి పాల్పడతామని ఆ మెసేజ్​లో ఉంది.

Terror attack in India : దేశంలో 26/11 తరహా ఉగ్రదాడులకు పాల్పడతామని వచ్చిన వాట్సాప్​ మెసేజ్​తో ముంబై పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు ఈ వార్త కలకలం సృష్టిస్తోంది.

ముంబై పోలీస్​ ట్రాఫిక్​ కంట్రోల్​కు శనివారం ఉదయం ఈ మెసేజ్​ వచ్చింది. 26/11 తరహా దాడులు చేస్తామని.. పాకిస్థాన్​ ఆధారిత ఫోన్​ నెంబర్​ నుంచి.. ముంబై పోలీసులకు ఈ మెసేజ్​ అందింది.

మెసేజ్​ ప్రకారం.. ఆరుగురు ఉగ్రవాదులు.. దేశంలో ఉగ్రదాడికి పాల్పడతారు!

ఈ మెసేజ్​ ఎవరు పంపారు? ఇందులో నిజమెంత? అన్న వివరాలు ఇంకా తెలియలేదు. అయితే.. పోలీసులు మాత్రం ఈ వాట్సాప్​ మెసేజ్​ను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

'టెర్ర్​ బోట్​..'

26/11 attacks : ఉగ్రదాడులపై బెదిరింపులు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. అయితే.. ఆధునిక ఆయుధాలతో కూడిని ఓ బోటును మహారాష్ట్ర పోలీసులు కొన్ని రోజుల క్రితమే పట్టుకున్న నేపథ్యంలో.. తాజా ఘటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌హారాష్ట్ర‌లోని హ‌రిహ‌రేశ్వ‌ర్ తీరానికి ఒక బోటు వ‌చ్చింది. అందులో నిండుగా ఆయుధాలు ఉన్నాయి. ఏకే 47 తుపాకులు, బుల్లెట్లు, ఇత‌ర పేలుడు ప‌దార్ధాల‌తో ఆ బోటు నిండి ఉంది. ఆ బోటును పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు న‌మోదు చేశారు.

ఆయుధాల‌తో కూడిన ఆ బోటును భార‌త్‌లో ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌లో ఉగ్ర దాడులు చేసే ఉద్దేశంతోనే పంపించి ఉంటార‌ని భావిస్తున్నారు. ఆ బోటుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను పోలీసులు వెల్ల‌డించ‌డం లేదు. అందులో ఎవ‌రైనా ఉన్నారా? లేక కేవ‌లం ఆయుధాల‌తో ఆ బోటు వ‌చ్చిందా? అనే విష‌యంలోనూ స్ప‌ష్ట‌త లేదు. అయితే, అది స్పీడ్ బోటు అని తెలుస్తోంది. మ‌హారాష్ట్ర‌లోని రాయిగ‌ఢ్ జిల్లాలోని హ‌రిహ‌రేశ్వ‌ర్ తీరానికి ఆ ప‌డ‌వ వ‌చ్చింది. ఆ ప్ర‌దేశం ముంబైకి 200 కిమీ దూరంలో, పుణెకు 170కిమీల దూరంలో ఉంది. ఈ ఘ‌ట‌న‌తో రాయిగ‌ఢ్ వ్యాప్తంగా పోలీసులు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

26/11 దాడులు..

2008లో జరిగిన ఉగ్రదాడులను దేశం ఇంకా మర్చిపోలేదు. పలువురు ఉగ్రవాదులు.. సముద్ర మార్గంలో ముంబైలోకి చొరబడి.. అలజడులు సృష్టించారు. ఆయుధాలతో ముంబై వీధుల్లో విచ్చలవిడిగా సంచరించి.. ప్రజల ప్రాణాలు తీశారు. తాజ్​ హోటల్​లోకి చొరబడి.. హింసాకాండకు పాల్పడ్డారు.

ఈ ఘటనలో అనేక మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు.

సంబంధిత కథనం