26/11 ముంబై దాడుల సూత్రధారికి 15ఏళ్ల జైలు శిక్ష!-mumbai terror attack handler jailed for 15 years in pakistan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mumbai Terror Attack Handler Jailed For 15 Years In Pakistan

26/11 ముంబై దాడుల సూత్రధారికి 15ఏళ్ల జైలు శిక్ష!

Sharath Chitturi HT Telugu
Jun 25, 2022 07:40 AM IST

లష్కరే తోయిబాకు చెందిన సాజిద్​ మజీద్​ మీర్​కు పాకిస్థాన్​ కోర్టు 15ఏళ్ల జైలు శిక్ష విధించింది! 26/11 ముంబై దాడిలో అతడు కీలక పాత్ర పోషించాడు.

26/11 ముంబై దాడుల సూత్రధారికి 15ఏళ్ల జైలు శిక్ష!
26/11 ముంబై దాడుల సూత్రధారికి 15ఏళ్ల జైలు శిక్ష! (HT_PRINT)

26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబాకు చెందిన సాజిద్​ మజీద్​ మీర్​కు.. పాకిస్థాన్​లోని ఓ కోర్టు 15ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదానికి నిధులు చేరవేస్తున్నాడన్న ఆరోపణలు రుజువు అవ్వడంతో లాహోర్​లోని యాంటీ టెర్రరిజం కోర్టు ఈ మేరకు చర్యలు చేపట్టింది. జైలు శిక్షతో పాటు రూ. 4లక్షల జరిమానా సైతం విధించింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ తీర్పును ఈ నెల తొలినాళ్లల్లోనే వెలువరించినట్టు తెలుస్తోంది. కాగా.. కేసుకు సంబంధించిన ఓ న్యాయవాది.. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. సాజిద్​ను ఈ ఏడాది ఏప్రిల్​లో పోలీసులు అరెస్ట్​ చేశారని.. అప్పటి నుంచి అతను కాట్​ లక్​పత్​ జైలులోనే ఉంటున్నాడని వెల్లడించారు.

కాగా.. సాజిద్​ మీర్​.. మరణించాడని కొన్నేళ్ల క్రితం వార్తలు వెలువడ్డాయి.

ఇండియాలో 'మోస్ట్​ వాంటెడ్​' లిస్ట్​లో సాజిద్​ మీర్​ పేరు ఉంది. అతడి తలపై 5మిలియన్​ డాలర్ల రివార్డు కూడా ఉంది. 166మంది మరణించిన 26/11 ముంబై దాడుల్లో అతడి పాత్ర కీలకం. ఆ దాడుల్లో అతడిని 'ప్రాజెక్ట్​ మేనేజర్​' అని పిలిచేవారు. 2005లో అక్రమ పాస్​పోర్టు ద్వారా ఇండియాలోకి ప్రవేశించాడు సాజిద్​ మీర్​.

ప్రస్తుతం ఎఫ్​ఏటీఎఫ్​(ఫైనాన్షియల్​ టాస్క2 ఫోర్స్​) జాబితాలో పాకిస్థాన్​ 'గ్రే' లిస్ట్​లో కొనసాగుతోంది. చివరిగా జరిగిన సమావేశంలో.. సాజిద్​ను పట్టుకున్నట్టు ఎఫ్​ఏటీఎఫ్​కు పాకిస్థాన్​ వెల్లడించినట్టు తెలుస్తోంది.

26/11 దాడులకు సంబంధించిన మరో సూత్రధారి, జమాత్​ ఉద్​ దావా చీఫ్​ హఫీజ్​ సాయిద్​కు​.. టెర్రర్​ ఫైనాన్సింగ్​ కేసులో ఇప్పటికే 68ఏళ్ల జైలు శిక్ష పడింది.

ముంబై దాడులను అమలు చేసిన కమాండర్​ జాకిర్​ రెహ్మాన్​ లఖ్వి.. ఇప్పటికే జైలులో ఉన్నాడు.

ఎల్​ఈటీ కార్యకలాపాలన్నీ జమాత్​ ఉద్​ దావా చూసుకుంటోంది. ఈ క్రమంలోనే రెండు ఉగ్రసంస్థలు కలిసి ముంబైలో భీకర దాడులకు పాల్పడ్డాయి.

ఎఫ్​ఏటీఎఫ్​..

ఉగ్రవాదులకు పాకిస్థాన్​ అడ్డాగా మారిందని అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్​ను 2018లో గ్రే లిస్ట్​లో పెట్టింది ఎఫ్​ఏటీఎఫ్​. గ్రే లిస్ట్​లో ఉన్న దేశాలకు.. అప్పులు సులభంగా రావు. ఇతర విషయాలు కూడా కఠినంగానే ఉంటాయి. ఉగ్రవాదానికి చెక్​ పెట్టాలని, ఇండియాపై దాడులు చేసేందుకు పాక్​ను ఉపయోగించుకోకుండా చూసుకోవాలని ఆ దేశానికి ఎఫ్​ఏటీఎఫ్​ తేల్చిచెప్పింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్