Fine For Staff: సహోద్యోగిని ఆ సమయంలో డిస్ట్రబ్ చేస్తే రూ.లక్ష ఫైన్: ముంబై కంపెనీ నయా రూల్
₹1 Lakh Fine For Staff: సెలవుల్లో (Vacation) ఉన్న సహోద్యోగి (colleges)ని డిస్ట్రబ్ చేస్తే రూ.లక్ష జరిమానా విధిస్తూ ఓ రూల్ అమలు చేస్తోంది ముంబైకి చెందిన ఓ సంస్థ. వివరాలివే..
Rs.1 Lakh Fine For Staff: చాలా మంది ఉద్యోగులు నిత్యం ఉరుకులు పరుగులతో పని చేస్తుంటారు. ఒత్తిడి వాతావరణంలో ఉద్యోగ విధుల మీదనే దృష్టి సారిస్తుంటారు. అందుకే కొంతకాలం సెలవులు తీసుకొని ప్రయాణాలు చేయాలని చాలా మంది భావిస్తారు. చాలా మంది ఉద్యోగులు (Employees) వీలైనప్పుడల్లా సెలవులు (Vacation) తీసుకొని కుటుంబంతో వేరే ప్రాంతాలకు వెళ్లి.. రిలాక్స్ అవుతుంటారు. అయితే.. ఇలా వెకేషన్‍లో ఉన్నప్పుడు కూడా ఏవో సందేహాలు ఉన్నాయంటూ, అత్యవసరం అంటూ ఆఫీస్‍లోని వేరే ఉద్యోగుల నుంచి కాల్స్ వస్తుంటే ఎంతో చిరాకుగా అనిపిస్తుంది. వేరే ప్రాంతాల్లో ఉన్నా మళ్లీ ఆఫీస్ మూడ్‍లోకి వెళ్లిపోతారు. అలా జరగకుండా ఉండేందుకు ముంబైకి చెందిన ఓ సంస్థ వినూత్నమైన రూల్ తీసుకొచ్చింది. వెకేషన్‍లో ఉన్న ఉద్యోగిని ఆఫీస్ పనుల నిమిత్తం తమ సిబ్బందిలో ఎవరైనా సంప్రదిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
డిస్ట్రబ్ చేస్తే రూ.లక్ష ఫైన్..
Rs.1 Lakh Fine For Staff: వెకేషన్‍లో ఉన్న సహోద్యోగిని (colleges) ఎవరైనా ఉద్యోగులు ఆఫీస్ పనుల నిమిత్తం డిస్ట్రబ్ చేస్తే రూ.లక్ష ఫైన్ విధిస్తామని ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‍ఫామ్ ‘డ్రీమ్ ఎలెవెన్’ (Dream 11) వెల్లడించింది. సంవత్సరానికి ఒక వారం పాటు ఉద్యోగులను పూర్తిగా పనికి దూరం ఉంచేందుకు, వారు పూర్తిగా రిలాక్స్ అయ్యేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. సీఎన్‍బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రీమ్ ఎలెవెన్ కో-ఫౌండర్ భవిత్ సేత్ (Bhavit Sheth) ఈ వివరాలను వెల్లడించారు.
కారణమిదే..
“ఏడాదికి ఒకసారి.. ఒక వారం పాటు.. ఆఫీస్ వ్యవస్థ నుంచి మీరు (ఉద్యోగులు) పూర్తిగా దూరంగా ఉండాలి. మీకు స్లాక్, ఈమెయిల్స్, కాల్స్ ఏవీ ఉండవు. వారం రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా గడిపితే మీకు కూడా చాలా బాగుంటుంది. అలాగే మేం ఎవరి మీద ఎంత ఆధారపడ్డాం అన్నది కూడా స్పష్టంగా తెలుస్తుంది” అని Dream 11 కో-పౌండర్ భవిత్.. ఉద్యోగులను ఉద్దేశించి చెప్పారు. ఇప్పటి వరకు ఈ సిస్టమ్ చాలా ప్రభావవంతంగా ఉందని తెలిపారు.
నూతనోత్సాహం వస్తుంది
“ఎలాంటి ఆటంకాలు లేని సెలవులు గడిపితే.. ఉద్యోగులు రిలాక్స్ అవుతారు. నూతనోత్సాహంతో మళ్లీ వచ్చి బెస్ట్ ఇచ్చేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది” అని ఆయన చెప్పారు. డ్రీమ్ ఎలెవెన్ కంపెనీలోని ఉద్యోగులు వారికి ఇష్టమైన సమయంలో ఏడాది వారం రోజులు ఈ ప్రత్యేక సెలవులు తీసుకోవచ్చు.
ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు ఎంతో నాణ్యమైన బ్రేక్ దొరుకుతుంది. ప్రపంచంలో కొన్ని సంస్థలు కూడా ఇలాంటి వెకేషన్ సెలవులను ఇస్తున్నాయి. ఉద్యోగులను రిటైన్ చేసుకునేందుకు కూడా ఇలాంటి బెనిఫిట్స్ సంస్థలకు ఉపయోగపడుతున్నాయి.