Youngest app developer : 12ఏళ్లకే 'యాప్​ డెవలపర్​'.. గిన్నిస్​ బుక్​లో చోటు!-meet jhajjar boy who enters guinness book of world as youngest app developer ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Meet Jhajjar Boy Who Enters Guinness Book Of World As Youngest App Developer

Youngest app developer : 12ఏళ్లకే 'యాప్​ డెవలపర్​'.. గిన్నిస్​ బుక్​లో చోటు!

Sharath Chitturi HT Telugu
Aug 06, 2022 07:37 AM IST

Youngest app developer : అతను చదివేది 8వ తరగతి. అతని వయస్సు 12ఏళ్లు. కానీ అతని ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. 12ఏళ్లకే మూడు యాప్​లు రూపొందించి గిన్నిస్​ బుక్​లో చోటు సంపాదించుకున్నాడు. అతనే హరియాణాకు చెందిన కార్తికేయ జాఖర్​!

12ఏళ్లకే 'యాప్​ డెవలపర్​'.. గిన్నిస్​ బుక్​లో చోటు!
12ఏళ్లకే 'యాప్​ డెవలపర్​'.. గిన్నిస్​ బుక్​లో చోటు! (Twitter)

Youngest app developer : ఇప్పుడున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో పెద్దలు, యువతే కాదు.. పిల్లలు కూడా పోటీ పడుతున్నారు! ఇందుకు 12ఏళ్ల కార్తికేయ జాఖర్​ ఓ ఉదాహరణ. 12ఏళ్ల వయస్సులోనే మూడు యాప్​లను రూపొందించేశాడు. అంతేకాకుండా.. ప్రపంచంలోనే అతి పిన్న యాప్​ డెవలపర్​గా గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్​లో చోటు సంపాదించుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

హిందుస్థాన్​ టైమ్స్​ కథనం ప్రకారం.. హరియాణాలోని జాజర్​ ప్రాంతంలో నివాసముంటున్న కార్తికేయ.. 8వ తరగతి చదువుకుంటున్నాడు. అతని తండ్రి ఓ రైతు. కాగా.. కొవిడ్​ సంక్షోభంలో ఆన్​లైన్​ క్లాస్​ల కోసం రూ. 10వేలు పెట్టి కార్తికేయకు ఓ స్మార్ట్​ ఫోన్​ కొని ఇచ్చాడు అతని తండ్రి. చదువుకుంటూనే.. యూట్యూబ్​లో కోడింగ్​కి సంబంధించిన వీడియోలు చూడటం మొదలుపెట్టాడు కార్తికేయ. అక్కడ మొదలైన ప్రయాణం.. మూడు యాప్​లను రూపొందించేంత వరకు ఆగలేదు.

"జీకే ఆన్​లైన్​, రామ్​ కార్తిక్​ లర్నింగ్​ సెంటర్​, శ్రీ రామ్​ కార్తిక్​ డిజిటల్​ ఎడ్జ్యూకేషన్​ పేర్లతో మూడు యాప్​లను రూపొందించాను. ప్రస్తుతం 45వేలకుపైగా మంది విద్యార్థులకు ఈ యాప్​లు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాయి," అని కార్తికేయ వెల్లడించాడు.

ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్​ ఇండియా కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది.. సొంతంగా యాప్​లు డెవలప్​ చేసినట్టు కార్తికేయ వివరించాడు. దేశానికి సేవ చేయాలన్నది తన లక్ష్యం అని స్పష్టం చేశాడు.

Kartikeya Jakhar : యాప్​ డెవలప్​ చేయడంతో పాటు.. తన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శిస్తున్నాడు కార్తికేయ. ఇప్పటికే.. దిగ్గజ హార్వర్డ్​ వర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలు రాసి.. స్కాలర్​షిప్​ గెలుచుకున్నాడు. ఆ వర్సిటీ నుంచి బీఎస్​సీ కంప్యూటర్స్​ చదువుతున్నాడు.

కుమారుడి ప్రతిభను చూసి అతని తండ్రి సంబరపడిపోతున్నాడు. ప్రభుత్వం.. తన బిడ్డకు సాయం చేయాలని వేడుకుంటున్నాడు.

"నా కుమారుడు మరిన్ని యాప్​లను డెవలప్​ చేసేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాను. కార్తికేయ చాలా తెలివైనవాడు. డిజిటల్​ టెక్నాలజీ మార్గంలో ప్రయాణించి.. అతను దేశానికి సేవ చేయాలన్నది నా కోరిక," అని కార్తికేయ తండ్రి.. హిందుస్థాన్​ టైమ్స్​కు చెప్పాడు.

మరోవైపు.. బాలుడి ప్రతిభపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ ప్రశంసల వర్షం కురిపించారు. మరింత ఎదగాలని ఆశిస్తున్నట్టు ట్వీట్​ చేశారు.

ఇప్పుడు జాజర్​ ప్రాంతంలో కార్తికేయ హాట్​ టాపిక్​గా మారాడు. అంతేకాకుండా.. అతని చేత మాట్లాడించి.. ఇతర విద్యార్థుల్లో స్ఫూర్తినింపేందుకు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారు. అతనిని చూసి విద్యార్థులు కూడా తన ప్రతిభతో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని వారందరు ఆశిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం