సైకిల్​ తొక్కుతూ.. రూబిక్స్​ క్యూబ్​తో ఆటలు.. గిన్నిస్​ రికార్డు దాసోహం!-chennai boy solves rubik s cube on cycle ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Chennai Boy Solves Rubik's Cube On Cycle

సైకిల్​ తొక్కుతూ.. రూబిక్స్​ క్యూబ్​తో ఆటలు.. గిన్నిస్​ రికార్డు దాసోహం!

HT Telugu Desk HT Telugu
Mar 19, 2022 03:12 PM IST

చెన్నైకి చెందిన ఓ బాలుడు.. రూబిక్స్​ క్యూబ్​ను పూర్తి చేశాడు. ఇందులో వార్తేముందని అనుకుంటున్నారా? అతను పజిల్​ను పూర్తి చేసిన విధానమే హైలైట్​. సైకిల్​ తొక్కుతూ రూబిక్స్​ క్యూబ్​ను ఓ ఆట ఆడుకున్నాడు. ఏకంగా గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నాడు.

జయదర్శన్​ వెంకటేషన్​
జయదర్శన్​ వెంకటేషన్​ (INSTAGRAM)

Jayadharshan Venkatesan | రూబిక్స్​ క్యూబ్​.. ఈ పేరు వింటేనే చాలా మంది భయపడిపోతారు. 'మన వల్ల అయ్యే పనికాదురా..' అనుకుని వదిలేస్తారు. ఇంకొందరు.. పజిల్​ను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తూ విఫలమై చేతులెత్తేస్తారు. కానీ కొంతమంది.. సునాయాసంగా పజిల్​ను సాల్వ్​ చేసి, అది కూడా చాలా తక్కువ టైమ్​లోనే పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వార్తలు చూస్తూనే ఉంటాము. అయితే.. చెన్నైలోని ఓ 'వండర్​ కిడ్'​ చాలా డిఫరెంట్​గా, ఛాలెంజింగ్​గా.. సైకిల్​ తొక్కుతూ పజిల్​ను పూర్తి చేశాడు!

ట్రెండింగ్ వార్తలు

జయదర్శన్​ వెంకటేషన్​ అనే బాలుడు.. తమిళనాడులోని చెన్నైలో నివాసముంటున్నాడు. సైకిల్​ తొక్కుతూ రూబిక్స్​ క్యూబ్​ను 14.32 సెకన్లలోనే సాల్వ్​ చేసేశాడు. గిన్నిస్​ వరల్డ్​ రికార్డు అతడి ప్రతిభకు దాసోహమైంది.

సైకిల్​ తొక్కుతూ రూబిక్స్​ క్యూబ్​ను పూర్తి చేస్తున్న వెంకటేషన్​ వీడియోను గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్​ తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో పోస్ట్​ చేసింది. కాళ్లతో సైకిల్​ తొక్కుతూ.. రెండు చేతులతో క్యూబ్​ను పట్టుకుని సాల్వ్​ చేశాడు వెంకటేషన్​.

అయితే ఇది అంత సులభమైన విషయం కాదు. ఈ రికార్డు కోసం వెంకటేషన్​ రెండేళ్ల నుంచి తీవ్రంగా ప్రాక్టీస్​ చేస్తున్నట్టు సమాచారం. తన మీద తనకు నమ్మకం కలిగిన తర్వాతే.. అతను బరిలోకి దిగాడు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నెటిజన్లు బాలుడి ప్రతిభను చూసి ఆశ్చర్యపోతున్నారు. 'వావ్​' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆ వీడియోను మీరూ చూసేయండి..

WhatsApp channel

సంబంధిత కథనం