LSAT 2023 registration: ఫేమస్ లా స్కూల్స్ లో అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ జారీ-lsat india june 2023 registration begins on lsatindiain ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Lsat India June 2023 Registration Begins On Lsatindia.in

LSAT 2023 registration: ఫేమస్ లా స్కూల్స్ లో అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ జారీ

HT Telugu Desk HT Telugu
Mar 23, 2023 03:29 PM IST

LSAT 2023 registration: భారత్ లోని ప్రముఖ న్యాయ విద్య కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ అయింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Getty Images/iStockphoto)

LSAT 2023 registration: భారత్ లోని ప్రముఖ న్యాయ విద్య కళాశాలల్లో ప్రవేశానికి ఉద్దేశించిన లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ 2023 (Law School Admission Test LSAT) నోటిఫికేషన్ జారీ అయింది. 2023 జూన్ ఎడిషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఇది.

ట్రెండింగ్ వార్తలు

LSAT 2023 registration: ఆన్ లైన్ లో..

2023 జూన్ ఎడిషన్ ఎల్ స్యాట్ (Law School Admission Test LSAT) కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గానూ వారు అధికారిక వెబ్ సైట్ lsatindia.in. ను సందర్శించాలి. దరఖాస్తులను పంపించడానికి ఆఖరు తేదీ మే 26. అలాగే, ఏ రోజున ఈ పరీక్ష రాయాలని నిర్ధారించే ఈ ఎల్ స్యాట్ (Law School Admission Test LSAT) టెస్ట్ ష్కెడ్యూలింగ్ ఏప్రిల్ 17 నుంచి మే 29 వరకు ఉంటుంది. ఎల్ స్యాట్ (LSAT) పరీక్షలు వివిధ స్లాట్స్ లో జూన్ 8 నుంచి జూన్ 11 మధ్య ఆన్ లైన్ లో జరుగుతాయి.

LSAT 2023 registration: ఏయే కాలేజెస్ లో అడ్మిషన్లు..

ఈ ఎల్ స్యాట్ (Law School Admission Test LSAT) స్కోర్ ద్వారా మొత్తం 12 లా కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతాయి. అవి జిందాల్ గ్లోబల్ లా స్కూల్, యూపీఈఎస్, బీఎంఎల్ ముంజాల్ యూనివర్సిటీ, జీడీ గోయెంకా యూనివర్సిటీ, విట్ చెన్నై స్కూల్ ఆఫ్ లా, అలయన్స్ యూనివర్సిటీ, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, ఏషియన్ లా కాలేజ్, ఐఎస్బీఆర్ లా కాలేజీ, లాయిడ్ లా కాలేజీ, మేవార్ యూనివర్సిటీ, శోభిత్ యూనివర్సిటీ. ఈ కళాశాలలు LSAT స్కోర్ ఆధారంగానే అడ్మిషన్లు ఇస్తాయి.

LSAT 2023 registration: అన్ని సీట్లు ఈ పరీక్ష ఆధారంగానే

తమ యూనివర్సిటీ లోని 5 సంవత్సరాల బీకాం ఎల్ఎల్బీ (BCom LLB), బీఏ ఎల్ఎల్బీ (BA LLB), బీబీఏ ఎల్ఎల్బీ (BBA LLB) కోర్సుల అడ్మిషన్లను పూర్తిగా ఎల్ స్యాట్ (LSAT) ఆధారంగానే పూర్తి చేస్తామని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ స్పష్టం చేసింది. LSAT స్కోర్ ఆధారంగా 10% నుంచి 75% వరకు ట్యూషన్ ఫీలో మినహాయింపు కూడా ఉంటుందని తెలిపింది. ఈ పరీక్షలో మొత్తం 92 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2గంటల 20 నిమిషాల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.

IPL_Entry_Point

టాపిక్