Congress Steering Committee: సీడబ్ల్యూసీ స్థానంలో కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ
Congress Steering Committee: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం మల్లిఖార్జున్ ఖర్గే 47 మందితో పార్టీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
Congress Steering Committee: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్థానంలో పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొత్తగా మళ్లీ CWC ఏర్పడే వరకు తాత్కాలికంగా CWC బాధ్యతలను నిర్వర్తిస్తుంది.
Congress Steering Committee: CWC సభ్యులే..
ఈ 47 మంది సభ్యుల కమిటీలో అత్యధికులు CWCలో ఉన్నవారే. ఈ కమిటీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు ఉన్నారు. పార్టీ తదుపరి ప్లీనరీలో కొత్త CWC ని ఏర్పాటు చేస్తారు. పార్టీ అధ్యక్ష పదవికి ఖర్గే ఎన్నిక కాగానే, సీడబ్ల్యూసీ సభ్యులు, ఇతర ఆఫీస్ బేరర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. తద్వారా ఖర్గేకు తన సొంత టీమ్ ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు.
Congress Steering Committee: ప్రియాంక కూడా..
ఖర్గే ఏర్పాటు చేసిన కొత్త స్టీరింగ్ కమిటీలో ప్రియాంక గాంధీ, అంబికా సోనీ, ఏకే ఆంటోనీ, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్, రణ్ దీప్ సూర్జేవాలా తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ లో CWC అత్యున్నత నిర్ణాయక బృందం. ప్రస్తుతం CWC బాధ్యతలను కొత్తగా ఏర్పడిన స్టీరింగ్ కమిటీ చూస్తుంది. వచ్చే సంవత్సరం మార్చిలో జరిగే పార్టీ ప్లీనరీలో కొత్త CWC ఏర్పడుతుంది.