Jiah Khan suicide case verdict live updates : జియా ఖాన్​ ఆత్మహత్య కేసులో సూరజ్​ పంచోలీకి క్లీన్​ చిట్-jiah khan suicide case verdict live updates cbi court acquits actor sooraj pancholi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jiah Khan Suicide Case Verdict Live Updates : జియా ఖాన్​ ఆత్మహత్య కేసులో సూరజ్​ పంచోలీకి క్లీన్​ చిట్

Jiah Khan suicide case verdict live updates : జియా ఖాన్​ ఆత్మహత్య కేసులో సూరజ్​ పంచోలీకి క్లీన్​ చిట్

Sharath Chitturi HT Telugu
Apr 28, 2023 12:59 PM IST

Jiah Khan suicide case verdict live updates : సినీ నటుడు సూరజ్​ పంచోలీకి భారీ ఉపశమనం! బాలీవుడ్​ నటి జియా ఖాన్​ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం క్లీన్​చిట్​ ఇచ్చింది.

సూరజ్​ పంచోలీ
సూరజ్​ పంచోలీ (PTI)

Jiah Khan suicide case verdict live updates : బాలీవుడ్​ నటి జియా ఖాన్​ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు సూరజ్​ పంచోలీని నిర్దోషిగా తేలుస్తూ.. శుక్రవారం తీర్పునిచ్చింది ముంబైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఈ కేసులో తుది వాదనలను గత వారం విన్న సీబీఐ కోర్టు జడ్జి జస్టిస్​ ఏఎస్​ సయ్యద్​.. తాజాగా సూరజ్​కు క్లీన్​చిట్​ ఇచ్చారు.

అసలేంటి ఈ కేసు..?

అమెరికా పౌరసత్వం కలిగిన జియా ఖాన్​(25).. 2013లో ఆత్మహత్యకు పాల్పడింది. జూహులోని తన నివాసంలో జూన్​ 3న సూసైడ్​ చేసుకుంది. అనంతరం పోలీసులకు ఓ 6 పేజీల నోట్​ కనిపించింది. దాని ఆధారంగా ముంబై పోలీసులు.. ఆదిత్య పంచోలీ- జరైన్​ వాహబ్​ల కుమారుడు సూరజ్​ పంచోలీని అరెస్ట్​ చేశారు. ఆత్మహత్యకు పాల్పడే విధంగా జియా ఖాన్​ను తన బాయ్​ఫ్రెండ్​ సూరజ్​ ప్రేరేపించాడని.. అతనిపై సెక్షన్​ 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కింద దోషిగా తేలితే.. గరిష్ఠంగా 10ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది.

Sooraj pancholi verdict : కొంతకాలం తర్వాత సూరజ్​ పంచోలీకి బెయిల్​ లభించింది. అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. ముంబై పోలీసులకు లభించిన 6 పేజీల నోట్​ జియా ఖాన్​ రాసినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. 'సూరజ్​ తనని లైంగికంగా వేధిస్తున్నట్టు, మానసికంగా- భౌతికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు ఆ లేఖలో రాసి ఉంది,' అని సీబీఐ చెబుతోంది.

సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. తీర్పునిచ్చే అధికరం తమకు లేదని సెషన్స్​ కోర్టు చేప్పడంతో.. 2021లో సీబీఐ స్పెషల్​ కోర్టుకు ఈ కేసు చేరింది.

జియా ఖాన్​ తల్లి మాటలు..

Jiah Khan death : ఈ కేసులో జియా ఖాన్​ తల్లి రబియా ఖాన్​ కీలక సాక్షిగా ఉన్నారు. తన కూతురిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె విచారణలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని గతంలో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను బాంబే హైకోర్టు గతేడాది కొట్టివేసింది.

సూరజ్​ పంచోలీ తన కుమార్తెను చిత్రహింసలకు గురి చేసేవాడని రబియా ఖాన్​ విచారణలో చెప్పారు. ఈ పూర్తి వ్యవహారంలో సీబీఐ తమకు అన్యాయం చేస్తోందని, తన కూతురు ఆత్మహత్య చేసుకునే ప్రాణాలు తీసుకుందనడానికి దర్యాప్తు సంస్థ వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు.

Jiah Khan verdict : ఈ ఆరోపణలను సూరజ్​ పంచోలీ ఖండించాడు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చిచెప్పాడు. చివరికి.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కూడా ఇదే చెప్పింది!

IPL_Entry_Point

సంబంధిత కథనం