ISRO IPRC Recruitment 2023: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: వివరాలివే-isro iprc recruitment 2023 applications process begins at iprc gov in for 63 posts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Isro Iprc Recruitment 2023: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: వివరాలివే

ISRO IPRC Recruitment 2023: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 06, 2023 07:58 AM IST

ISRO IPRC Recruitment 2023: ఇస్రో ఐపీఆర్‌సీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది.

ISRO IPRC Recruitment 2023: ఇస్రోలో ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్: వివరాలివే
ISRO IPRC Recruitment 2023: ఇస్రోలో ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్: వివరాలివే (HT Photo)

ISRO IPRC Recruitment 2023: ఉద్యోగాల భర్తీకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌ (ISRO IPRC)లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఇస్రో ఐపీఆర్‌సీ వెబ్‍సైట్ iprc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆఖరు గడువు ఏప్రిల్ 24వ తేదీగా ఉంది. 63 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలివే..

ఖాళీల వివరాలు

  • టెక్నికల్ అసిస్టెంట్: 24 పోస్టులు
  • టెక్నిషియన్ ‘బీ’: 30 పోస్టులు
  • డ్రాట్స్‌మ్యాన్ ‘బీ’: 1 పోస్టు
  • హెవీ వెహికల్ డ్రైవర్ ‘ఏ’: 5 పోస్టులు
  • లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఏ’: 2 పోస్టులు
  • ఫైర్ మ్యాన్ ‘ఏ’: 1 పోస్టు

మొత్తం ఖాళీలు : 63 పోస్టులు

ISRO IPRC Recruitment 2023: విద్యార్హత, వయోపరిమితి విభిన్న పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. నోటిఫికేషన్‍లో ఈ వివరాలు పూర్తిగా ఉన్నాయి. పోస్టును బట్టి పదోతరగతి/ఇంజినీరింగ్/డిప్లొమా అర్హతతో పాటు సంబంధిత స్పెషలైజేషన్ ఉండాలి. iprc.gov.in వెబ్‍సైట్‍లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంది. అర్హత వివరాలను అభ్యర్థులు నిశితంగా పరిశీలించాలి. అభ్యర్థుల వయసు ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఫైర్ మ్యాన్ పోస్టుకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

ISRO IPRC Recruitment 2023: కంప్యూటర్ బేస్డ్ టెస్టు (CBT) పరీక్ష, స్కిల్ టెస్టు ద్వారా ఈ ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. ఆయా పోస్టులను బట్టి స్కిల్ టెస్టు విభిన్నంగా ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నిషియన్, డ్రాట్స్ మ్యాన్ పోస్టులకు సిలబస్ నుంచే స్కిల్ టెస్ట్ ఉంటుంది. వెహికల్ డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ స్కిల్ టెస్టుగా ఉంటుంది. ఫైర్ మ్యాన్‍కు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు + మెడికల్ ఎగ్జామ్ స్కిల్ టెస్టుగా ఉండనుంది.

అప్లికేషన్ ఫీజు

ISRO IPRC Recruitment 2023: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు అప్లికేషన్ ఫీజు రూ.750గా ఉంది. టెక్నిషియన్ ‘బి’, డ్రాట్స్‌మ్యాన్ ‘బీ’, హెవీ వెహికల్ డ్రైవర్ ‘ఏ’, లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఏ’, ఫైర్ మ్యాన్ ‘ఏ’ పోస్టులకు ఫీజు రూ.500. iprc.gov.in వెబ్‍సైట్‍లో ఆన్‍లైన్ దరఖాస్తు చేసిన సమయంలోనే ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 24వ తేదీ సాయంత్రం 4 గంటలు దరఖాస్తుకు తుది గడువుగా ఉంది.

IPL_Entry_Point