Venkaiah Naidu : రాజ్యసభ ఛైర్మన్​గా వెంకయ్య నాయుడికి ఫుల్​ మార్క్​లు పడ్డాయా?-initial turbulence and later recovery marked the tenure of venkaiah naidu as chairman ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Initial Turbulence And Later Recovery Marked The Tenure Of Venkaiah Naidu As Chairman

Venkaiah Naidu : రాజ్యసభ ఛైర్మన్​గా వెంకయ్య నాయుడికి ఫుల్​ మార్క్​లు పడ్డాయా?

Sharath Chitturi HT Telugu
Aug 06, 2022 11:57 AM IST

Venkaiah Naidu : రాజ్యసభ ఛైర్మన్​గా వెంకయ్య నాయుడికి ఇవే చివరి పార్లమెంట్​ సమావేశాలు. పెద్దల సభ ఛైర్మన్​గా ఆయన ఉత్పాదకత తొలుత చాలా తక్కువగా ఉండేది. అనంతరం పుంజుకుంది.

రాజ్యసభ ఛైర్మన్​గా వెంకయ్య నాయుడికి ఫుల్​ మార్క్​లు పడ్డాయా?
రాజ్యసభ ఛైర్మన్​గా వెంకయ్య నాయుడికి ఫుల్​ మార్క్​లు పడ్డాయా? (ANI)

Venkaiah Naidu : ఈ నెల 10తో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుంది. వెంకయ్య నాయుడు పదవీకాలంలో ఎన్నో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఎంపీల సస్పెన్షన్​ వంటి కఠిన నిర్ణయాలు సైతం వెంకయ్య తీసుకున్నారు. కాగా.. రాజ్యసభ ఛైర్మన్​గా వెంకయ్య నాయుడి ఉత్పాదకత తొలుత చాలా తక్కువగా ఉన్నా.. అనంతరం భారీగా పుంజుకుంది.

2022 బడ్జెట్​ సెషన్​ వరకు.. వెంకయ్య నాయుడు హయాంలో 13 పార్లమెంట్​ సమావేశాలు పూర్తిగా సాగాయి. మొదటి కొన్ని సెషన్స్​లో రాజ్యసభ ఛైర్మన్​గా ఆయన ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. ఐదు సెషన్లలో ఉత్పాదకత 6.8శాతం- 58.80శాతంగా నమోదైంది. కానీ ఆ తర్వాతి 8 సెషన్లు.. రాజ్యసభ కార్యకలాపాలు జోరుగా సాగించారు వెంకయ్య నాయుడు. 6 సెషన్లలోనే ఆయన ఉత్పాదకత 76శాతం- 105శాతం మధ్యలో నిలిచింది. ఐదు సెషన్స్​లో.. 100శాతం సమయాన్ని వినియోగించుకుని రాజ్యసభ పని చేయడం విశేషం.

13సెషన్లలో.. అనేక మార్లు రాజ్యసభ వాయిదా పడింది. ఇందుకు 58 ప్రధాన కారణాలున్నాయి. ఆయా సందర్భాల్లో సమస్య పరిష్కారానికి వెంకయ్య నాయుడు కృషి చేశారు.

"సమావేశాల్లోని 57శాతం రోజులు పాక్షికంగా- లేదా పూర్తిగా వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా అంశం 36సార్లు ప్రస్తావనకు వచ్చింది. ఒక్క 2018 బడ్జెట్​ సమావేశాల్లోనే ఆ అంశాన్ని 24సార్లు ప్రస్తావించారు," అని ఒక అధికారిక ప్రకటన వెలువడింది.

రైతు చట్టాలు- నిరసనలు, పెగాసెస్​ స్పైవేర్​, కావేరీ బోర్డు ఏర్పాటు వంటి అంశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2021 శీతాకాల సమావేశాల్లో 12మంది ఎంపీల సస్పెన్షన్​ సైతం సభ కార్యకలాపాలను ప్రభావితం చేసింది.

Parliament monsoon session : రాజ్యసభ ఛైర్మన్​గా వెంకయ్య నాయుడు పదవీకాలంలో.. 78శాతం ఎంపీలు ప్రతిరోజు పెద్దలసభకు హాజరయ్యారు. 3శాతం మంది హాజరుకాలేదు. వివిధ సెషన్స్​లో.. 30శాతం మంది ఎంపీలకు ఫుల్​ అటెండెన్స్​ ఉండటం విశేషం.

1978 నుంచి రాజ్యసభ కార్యకలాపాలకు సంబంధించి డేటాను తయారు చేయడం అనవాయతీగా వస్తోంది. అన్ని సెషన్లలోనూ కశ్ఛన్​ హవర్​కు క్రమంగా సమయం తగ్గిపోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది!

IPL_Entry_Point

సంబంధిత కథనం