Bihar Road Horror : వృద్ధుడిని 8కి.మీలు ఈడ్చుకెళ్లిన కారు.. చివరికి!-in bihar road horror case car drags 70 year old for 8 km crushes him to death ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  In Bihar Road Horror Case, Car Drags 70-year-old For 8 Km, Crushes Him To Death

Bihar Road Horror : వృద్ధుడిని 8కి.మీలు ఈడ్చుకెళ్లిన కారు.. చివరికి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 22, 2023 02:01 PM IST

Bihar Road Horror : వృద్ధుడిని ఢీకొట్టి.. కారు మీద ఆయన్ని 8కి.మీల దూరం వరకు ఈడ్చుకెళ్లిన ఘటన బిహార్​లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.

వృద్ధుడిని 8కి.మీలు ఈడ్చుకెళ్లిన కారు.. చివరికి!
వృద్ధుడిని 8కి.మీలు ఈడ్చుకెళ్లిన కారు.. చివరికి!

Bihar Road Horror : బిహార్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 70ఏళ్ల వృద్ధుడిని ఓ కారు ఢీకొట్టింది. కారు బోనెట్​ మీద వృద్ధుడు పడగా.. 8 కి.మీల దూరం వరకు ఆయన్ని ఈడ్చుకెళ్లాడు డ్రైవర్​. అనంతర పరిణామాలతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.

అసలేం జరిగిందంటే..

తూర్పు చంపారణ్​ జిల్లాలోని నేషనల్​ హైవే 27 మీద జరిగింది ఈ ఘటన. బాంగ్రా గ్రామానికి చెందిన 70ఏళ్ల శంకర్​ చౌదరి అనే వృద్ధుడు.. తన సైకిల్​ మీద బయటకెళ్లాడు. గోపాల్​గంజ్​ నుంచి వస్తున్న ఓ కారు.. బాంగ్రా చౌక్​ వద్ద.. ఆ వృద్ధుడి సైకిల్​ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ వృద్ధుడు ఎగిరి, కారు మీదపడ్డాడు. వైపర్​ను పట్టుకుని ఉండిపోయాడు. కారు ఆపి తనని దింపమని డ్రైవర్​ను వేడుకున్నాడు. కానీ ఆ డ్రైవర్​ ఇంకా వేగంతో కారును నడిపాడు. స్థానికులు.. కారును ఆపాలని గట్టిగా అరిచారు. కారును వెంబడించారు. కానీ ఫలితం దక్కలేదు.

Car drags 70 year old for 8 kms : చివరికి.. 8కి.మీల దూరంలో ఉన్న కదం చౌక్​ ప్రాంతంలో కారు బ్రేక్​ పడింది. కారు మీద నుంచి ఎగిరి రోడ్డు మీద పడ్డాడు శంకర్​ చౌదరి. వృద్ధుడి మీద నుంచి కారు నడిపించాడు ఆ డ్రైవర్​. ఫలితంగా.. శంకర్​ చౌదరి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

పరారీలో నిందితులు..

ఘటనపై సమాచారం అందుకున్న కోట్వా పోలీస్​స్టేషన్​ చీఫ్​ అంజు కుమార్​.. ఆ ప్రాంతంలోని పోలీసులను అలర్ట్​ చేశారు. ఈ క్రమంలోనే పిప్రకోతి పోలీసులు కారను గుర్తించి, దానిని స్వాధీనం చేసుకున్నారు. కానీ.. డ్రైవర్​తో పాటు లోపల ఉన్న ప్రయాణికులు అప్పటికే తప్పించుకున్నారు.

Bihar road accident : ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కారు ఓనర్​కు సంబంధించిన వివరాలను సేకరించే ప్రక్రియను ముమ్మరం చేశారు.

ఢిల్లీలో..

Delhi road horror case : కారుతో మనుషులను ఢీకొట్టి.. వారిని ఈడ్చుకెళుతున్న ఘటనలు ఇటీవలే దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. న్యూఇయర్​ వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగివెళుతున్న 20ఏళ్ల అంజలి అనే యువతిని ఓ కారు ఢీకొట్టింది. ఆమె కాలు టైర్​ దగ్గర ఇరుక్కుపోయింది. ఈ విషయం తెలిసినప్పటికీ.. డ్రైవర్​ కారును దాదాపు 12కి.మీల దూరం కారను నడిపించాడు. ఈ ఘటనపై అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

IPL_Entry_Point