IBPS Exam Calendar: బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా..! ఐబీపీఎస్ క్యాలెండర్ వచ్చేసింది.. పరీక్షల తేదీలు ఇవే..-ibps exam 2023 calendar clerk po rrbs spl exam dates released at ibpsin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ibps Exam Calendar: బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా..! ఐబీపీఎస్ క్యాలెండర్ వచ్చేసింది.. పరీక్షల తేదీలు ఇవే..

IBPS Exam Calendar: బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా..! ఐబీపీఎస్ క్యాలెండర్ వచ్చేసింది.. పరీక్షల తేదీలు ఇవే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 17, 2023 03:50 PM IST

IBPS Exam 2023 Calendar: 2023కు గాను పరీక్షల క్యాలెండర్‌ను ఐబీపీఎస్ విడుదల చేసింది. అధికారిక వెబ్‍సైట్‍లో తేదీలను వెల్లడించింది.

IBPS  Exam Calendar: బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా..! ఐబీపీఎస్ క్యాలెండర్ వచ్చేసింది.. పరీక్షల తేదీలు ఇవే..
IBPS Exam Calendar: బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా..! ఐబీపీఎస్ క్యాలెండర్ వచ్చేసింది.. పరీక్షల తేదీలు ఇవే..

IBPS Exam 2023 Calendar: ఐబీపీఎస్ పరీక్షల 2023 క్యాలెండర్ వచ్చేసింది. ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ఈ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఆర్‌ఆర్‌బీలు (RRBs), పీవోలు (PO), క్లర్క్ (Clerk), ఎస్‍పీఎల్ (SPL) పరీక్షల అంచనా తేదీలను వెల్లడించింది. బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి కామన్ రిక్రూట్ ప్రాసెస్ (CRP) కోసం ఐబీపీఎస్ పరీక్షలు నిర్వహిస్తుంది. క్యాలెండర్ డైరెక్ట్ లింక్, ఐపీబీఎస్ 2023 పరీక్షల షెడ్యూల్ ఎలా ఉందో ఇక్కడ చూడండి.

ఆర్‌ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్స్, ఆఫీసర్ స్కేల్-1 పరీక్షల తేదీలు

IBPS Exam 2023 Calendar: ఐపీబీఎస్ క్యాలెండర్ ప్రకారం, ఆర్‌ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్స్, ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమినరీ పరీక్షలు ఈ సంవత్సరం ఆగస్టు 5, 6, 12, 13, 19వ తేదీల్లో జరుగుతాయి. ఆఫీసర్ స్కేల్-2, స్కేల్-3లకు ఒకే పరీక్ష ఉంటుంది. ఇది సెప్టెంబర్ 10వ తేదీన ఉంటుంది. ఆఫీసర్ స్కేల్-1 మెయిన్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 10న, ఆఫీస్ అసిస్టెంట్స్ మెయిన్ పరీక్ష సెప్టెంబర్ 16వ తేదీన జరుగుతుంది. 2023 పరీక్షల క్యాలెండర్‌ను ibps.in వెబ్‍సైట్‍లో ఐబీపీఎస్ అందుబాటులో ఉంటుంది.

క్లర్క్, పీవో పరీక్షల తేదీలు

IBPS Exam 2023 Calendar: ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమినరీ పరీక్షలు ఈ ఏడాది (2023) ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2వ తేదీల్లో జరుగుతాయి. క్లర్క్స్ మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్ 7న ఉంటుంది. ఐబీపీఎస్ పీవో (Probationary Officers) ప్రిలిమ్స్ పరీక్ష సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 1వ తేదీల్లో జరగనుంది. పీవో మెయిన్ పరీక్ష (PO Main Exam) నవంబర్ 5వ తేదీన ఉంటుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల కోసం ప్రిలిమ్స్ పరీక్ష డిసెంబర్ 30, 31వ తేదీల్లో జరగునుంది. 2024 జనవరి 28వ తేదీన మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్‍లైన్ ద్వారానే ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలకు ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. నోటిఫికేషన్‍ల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఐబీపీఎస్ అధికారిక వెబ్‍సైట్‍ను చెక్ చేస్తూ ఉండాలి. ఆ తేదీల మేరకు దరఖాస్తు చేసుకోవాలి.

IPL_Entry_Point

సంబంధిత కథనం