Hanuman Chalisa row | 'ప్రధాని ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుతాము..'-hanuman chalisa row ncp leader seeks amit shah s nod to chant religious prayers near pm s residence ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Hanuman Chalisa Row: Ncp Leader Seeks Amit Shah's Nod To Chant Religious Prayers Near Pm's Residence

Hanuman Chalisa row | 'ప్రధాని ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుతాము..'

HT Telugu Desk HT Telugu
Apr 25, 2022 05:51 PM IST

మహారాష్ట్ర: ప్రధాని ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుతామని, నమాజ్​ చేస్తామని అందుకు అనుమతులు కావాలని కేంద్రమంత్రి అమిత్​ షాకు లేఖ రాశారు ఓ ఎన్​సీపీ నేత. ఫలితంగా రాష్ట్రంలో హనుమాన్​ చాలీసా వివాదం మరింత ముదిరింది.

'ప్రధాని ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుతాము'
'ప్రధాని ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుతాము' (HT_PRINT/file)

Hanuman Chalisa row | మహారాష్ట్రలో హనుమాన్​ చాలీసా వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే.. ఎంపీ నవ్​నీత్​ కౌర్​ దంపతులు.. జైలుకెళ్లారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ఎన్​సీపీకి చెందిన ఓ ముస్లిం నేత స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు.. హనుమాన్​ చాలీసా చదవడంతో పాటు నమాజ్​ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం అనుమతులు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు లేఖ రాశారు.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుతామని ఎంపీ నవ్​నీత్​ రాణా​- ఎమ్మెల్యే రవి రాణాలు హెచ్చరించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య వారిని పోలీసులు అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు. వారికి ఇంకా బెయిల్​ కూడా మంజూరు కాలేదు. కాగా.. ఈ ఘటనలకు ప్రతీకారంగా.. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసం లోక్​ కల్యాణ్​ మార్గ్​ ముందు హనుమాన్​ చాలీసా చదువుతామని, అనుమతులు ఇవ్వాలని ఎన్​సీపీ నేత ఫమిద హసన్​ ఖాన్​ అమిత్​ షాకు లేఖ రాసినట్టు తెలుస్తోంది.

PM Modi | ముస్లిం అయినప్పటికీ.. తాను తన ఇంట్లో నిత్యం హనుమాన్​ చాలీసా, దుర్గా చాలీసా చదువుతానని హసన్​ వెల్లడించారు.

"దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిద్రలేపాల్సిన సమయం వచ్చింది. మతోశ్రీ(ఉద్ధవ్​ ఠాక్రే నివాసం) వద్ద హనుమాన్​ చాలీసా చదువుతామని నవ్​నీత్​, రవిలు అంటున్నారు. అలాంటప్పుడు.. ప్రధాని ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదవడానికి, నమాజ్​ చేయడానికి మాకు కూడా అనుమతులు ఇవ్వాలి," అని హసన్​ ఖాన్​ పేర్కొన్నారు.

'ఉద్ధవ్​ ఠాక్రేను నిద్రలేపి హిందుత్వాన్ని బోధిస్తామని ఆ దంపతులు అంటున్నారు. అలాంటప్పుడు.. మోదీ, అమిత్​ షాలను కూడా నిద్రలేపాలి. అసలు సమస్యల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. జీడీపీ వృద్ధి పడిపోతోంది. ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్ర ప్రభుత్వం.. ఇలాంటి విషయాల(హనుమాన్​ చాలీసా వివాదం)ను తీసుకొస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్