Gujarat riots 2002 : ‘19ఏళ్ల నిశ్శబ్ద పోరాటం.. ఇది మోదీకే సాధ్యం’-gujarat riots 2002 modiji endured false allegations says amit shah ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gujarat Riots 2002, Modiji Endured False Allegations Says Amit Shah

Gujarat riots 2002 : ‘19ఏళ్ల నిశ్శబ్ద పోరాటం.. ఇది మోదీకే సాధ్యం’

Sharath Chitturi HT Telugu
Jun 25, 2022 10:51 AM IST

Gujarat riots 2002 : గుజరాత్​ అల్లర్లపై కేంద్రమంత్రి అమిత్​ షా తొలిసారిగా స్పందించారు. 19ఏళ్ల పాటు ప్రధాని మోదీ తీవ్ర మనోవేదనకు గురయ్యారని, నిశ్శబ్దంగా పోరాటం చేశారని అన్నారు.

‘19ఏళ్ల నిశ్శబ్ద పోరాటం.. ఇది మోదీకే సాధ్యం’
‘19ఏళ్ల నిశ్శబ్ద పోరాటం.. ఇది మోదీకే సాధ్యం’ (ANI)

Gujarat riots 2002 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు కేంద్రమంత్ర అమిత్​ షా. 2002 గుజరాత్ అల్లర్లను ఉద్దేశించి.. తప్పుడు కేసుపై 19ఏళ్ల పాటు మోదీ పోరాటం చేశారని అన్నారు. ఓ శక్తివంతమైన నేత మాత్రమే ఈ విధంగా పోరాటం చేయగలుగుతారని షా కొనియాడారు.

2002 గుజరాత్​ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి సుప్రీంకోర్టు శుక్రవారమే క్లీన్​ చిట్​ ఇచ్చింది. తాజాగా.. ఈ పూర్తి వ్యవహారంపై తొలిసారి స్పందించారు అమిత్​ షా. ఈ మేరకు ఏఎన్​ఐ ఎడిటర్​ స్మితా ప్రకాష్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

"18-19ఏ్లళ పాటు నిశ్శబ్దంగా ఉంటూ మోదీ పోరాటం చేశారు. ఒక్క మాట కూడా అలేదు. ఆయన మనోవేదనను నేను దగ్గరగా చూశాను. ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఓ శక్తివంతమైన నేత మాత్రమే.. ఇలా ఉండగలరు," అని అమిత్​ షా అభిప్రాయపడ్డారు.

గుజరాత్​ అల్లర్ల కేసులో బీజేపీ తప్పు లేకపోయినా.. కొందరు రాజకీయాలు చేద్దామని ప్రయత్నించారని, మాటిమాటికి అగ్గి రాజేద్దామని చూశారని అమిత్​ షా అన్నారు. ఈ పూర్తి వ్యవహారంలో బీజేపీ పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని, కానీ సుప్రీంకోర్టు తీర్పుతో తమపై ఉన్న మచ్చ చెరిగిపోయిందని షా స్పష్టం చేశారు.

రాహుల్​పై సెటైర్లు..

Amit Shah Gujarat riots : ఈ క్రమంలోనే కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీపై పరోక్షంగా సెటైర్లు వేశారు అమిత్​ షా. నేషనల్​ హెరాల్డ్​ కేసులో భాగంగా ఈడీ విచారణకు రాహుల్​ గాంధీ వెళుతున్న విషయం తెలిసిందే. కానీ మోదీ ఎప్పుడు 'డ్రామా' చేయలేదని కాంగ్రెస్​ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు షా.

"గుజరాత్​ అల్లర్ల కేసులో సిట్​ ఏర్పడింది. సిట్​ విచారణ కోసం మోదీజీ వెళ్లారు. కానీ ఎప్పుడు డ్రామాలు చేయలేదు. మద్దతు కోసం ప్రయత్నించలేదు. ఎమ్మెల్యే, ఎంపీలు ధర్నాలు చేయాలని పిలుపునివ్వలేదు. సీఎంను సిట్​ ప్రశ్నించాలని అనుకుంటే.. ఆయనే స్వయంగా అక్కడికి వెళ్లి సహకరించేవారు. తప్పు లేకపోతే నిరసనలు చేయడం ఎందుకు?" అని అమిత్​ షా పేర్కొన్నారు.

"అల్లర్ల తర్వాత గుజరాత్​ ప్రభుత్వం ఆలస్యం చేయలేదు. అల్లర్లకు కారణమైన వారిపై చర్యలు చేపట్టింది. కానీ ఢిల్లీలో చాలా మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఒక్కరు కూడా అరెస్ట్​ అవ్వలేదు. మీరు(కాంగ్రెస్​) ఇప్పుడొచ్చి మమ్మల్ని తప్పుబడుతున్నారా?" అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి.

తనని కూడా జైలులో వేశారని, కానీ ఈ వ్యవహారం అంతా రాజకీయ లబ్ధి కోసం జరిగిందని రుజువైనట్టు పేర్కొన్నారు అమిత్​ షా.

సుప్రీం క్లీన్​ చిట్​..

Gujarat riots Supreme Court judgement : గుజరాత్‌ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోదీకి సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై జకియాజఫ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. గుజరాత్‌ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎంపీ ఎహ్సన్‌ జఫ్రీ సతీమణి జకియా జఫ్రీ సిట్‌ నివేదికను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ప్రధాని మోదీ సహా 64మంది సిట్‌ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆమె ప్రశ్నించారు. 2002 గుజరాత్‌ అల్లర్లలో ప్రధాని మోదీ పాత్రపై సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆమె తప్పు పట్టారు.

జకియా జఫ్రి పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఆమె అభ్యంతరాలను తోసిపుచ్చింది. జకియా జఫ్రి పిటిషన్‌పై స్పెషల్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పును జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌ సమర్ధించారు. 2002నాటికి గుజరాత్‌ అల్లర్ల వ్యవహారంలో దర్యాప్తు ముగిస్తూ సిట్‌ ఇచ్చిన నివేదికపై జకియా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దర్యాప్తు నివేదికపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం జకియా అభ్యర్థనను తోసిపుచ్చారు. సిట్‌ ప్రత్యేక న్యాయస్థానంతో పాటు గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సర్వోన్నత న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది.

చీకటి రోజు..

Gujarat riots : 2002 అల్లర్లలో గుల్బర్గ్ సొసైటీలో జరిగిన నరమేధంలో ఎంపీ ఎహ్సన్‌ జఫ్రీతో పాటు 68మంది ప్రాణాలు కోల్పోయారు. 2002 ఫిబ్రవరి 28న ఈ ఘటన జరిగింది. గోద్రా రైల్వే స్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌ తగులబడి 59మంది ప్రయాణికులు కోల్పోవడంతో చెలరేగిన అల్లర్లలో గుజరాత్‌లో భారీగా ప్రాణనష్టం జరిగింది నాటి అల్లర్లకు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ ప్రోద్భలంతోనే జరిగాయని ఆరోపిస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్