12% wage hike for insurerance employees: ప్రభుత్వ బీమా ఉద్యోగులకు వేతన పెంపు-govt notifies 12 wage hike for employees of psu general insurers links next with performance ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Govt Notifies 12% Wage Hike For Employees Of Psu General Insurers; Links Next With Performance

12% wage hike for insurerance employees: ప్రభుత్వ బీమా ఉద్యోగులకు వేతన పెంపు

HT Telugu Desk HT Telugu
Oct 15, 2022 10:22 PM IST

12% wage hike for insurerance employees: ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులకు దీపావళి పండుగ వేళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

12% wage hike for insurerance employees: ప్రభుత్వ రంగంలోని నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులకు సగటున 12 శాతం వేతనం పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో New India Assurance, National Insurance, Oriental Insurance and United India Insurance జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నాయి.

12% wage hike for insurerance employees: 2017 నుంచి..

ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులకు 12 శాతం వేతనం పెంపును 2017 ఆగస్ట్ నెల 1వ తేదీ నుంచి పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ శుక్రవారం వెలువడింది. దాని ప్రకారం.. ఆ నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులు, ఉద్యోగులు గత ఐదు సంవత్సరాల ఏరియర్స్ ను అందుకుంటారు.

12% wage hike for insurerance employees: తదుపరి రివిజన్ ఆగస్ట్ 2022

తదుపరి వేతన పెంపు పనితీరు ఆధారిత వేతన పెంపు విధానంలో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. performance based పెంపు ఉద్యోగుల, సంస్థ పని తీరుపై ఆధారపడి ఉంటుంది. అయితే, performance based వేతన పెంపును ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వేతన పెంపును పనితీరుతో అనుసంధానించడం అసంబద్ధమని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ‘ప్రభుత్వ రంగంలోని బీమా సంస్థలు ప్రైవేటు రంగంలోని సంస్థలతో పోటీ పడలేకపోతున్నాయి. వినియోగదారులకు అవి అందించే సౌకర్యాలను ప్రభుత్వ రంగ సంస్థలు అందించలేకపోతున్నాయి. అందువల్ల ఈ రెండింటి పనితీరును పోల్చలేం’ అని వాదిస్తున్నారు. అదీకాక, ప్రభుత్వ పథకాలన అమలు చేసే బాధ్యత కూడా ప్రభుత్వ రంగ బీమా సంస్థలపైనే ఉంటోందని గుర్తు చేశారు.

IPL_Entry_Point