Mallikarjun Kharge: కాంగ్రెస్ కొత్త చీఫ్ ఖర్గే గురించి ఈ విషయాలు తెలుసా?-from labour union leader to solilada sardara 10 things about kharge ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  From Labour Union Leader To 'Solilada Sardara': 10 Things About Kharge

Mallikarjun Kharge: కాంగ్రెస్ కొత్త చీఫ్ ఖర్గే గురించి ఈ విషయాలు తెలుసా?

HT Telugu Desk HT Telugu
Oct 19, 2022 03:14 PM IST

మల్లిఖార్జున్ ఖర్గే. కర్నాటకకు చెందిన దళిత నాయకుడు. దాదాపు 24 ఏళ్ల తరువాత కాంగ్రెస్ కు నేతృత్వం వహిస్తున్న తొలి గాంధీయేతర నేత. రాజకీయ జీవితంలో ఒకే ఒక్కసారి మినహా ఓటమి ఎరుగని యోధుడు.

కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లిఖారర్జున్ ఖర్గే
కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లిఖారర్జున్ ఖర్గే (Hindustan Times)

మల్లిఖార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడి గా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి, కేరళ కాంగ్రెస్ నేత శశి థరూర్ పై ఘన విజయం సాధించారు.

లేబర్ యూనియన్ లీడర్ గా..

మల్లిఖార్జున్ ఖర్గే క్రియాశీల రాజకీయ జీవితం లేబర్ యూనియన్ నాయకుడిగా ప్రారంభమైంది. ఖర్గేకు సంబంధించిన 10 ముఖ్యమైన విషయాలివి..

  1. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన రెండో దళిత నాయకుడు ఖర్గే. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించిన తొలి దళిత నేత జగ్జీవన్ రామ్.
  2. కర్నాటక నుంచి కాంగ్రెస్ చీఫ్ పదవి వరకు ఎదిగిన రెండో నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే. కర్నాటక నుంచి ఈ ప్రతిష్టాత్మక పదవి చేపట్టిన తొలి నాయకుడు నిజలింగప్ప. ఈయన 1968లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
  3. ఖర్గే 1942లో కర్నాటకలోని బీదర్ లో జన్మించారు. కాలేజీలో ఉండగానే రాజకీయాలు ఒంటబట్టాయి. సేఠ్ శంకర్ లాల్ లహోటీ కాలేజీలో లా చదివారు.
  4. ఆ తరువాత లేబర్ యూనియన్ నాయకుడిగా క్రియాశీల రాజకీయాలు ప్రారంభించారు. 1969లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొన్నాళ్లకే గుల్బర్గా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు.
  5. ఖర్గేను 'solilada sardara' అని కన్నడలో అభిమానులు పిలుచుకుంటారు. అంటే, ఓటమి ఎరుగని యోధుడు అని అర్థం. రాజకీయ జీవితంలో లోక్ సభ, అసెంబ్లీ కలిపి 12 ఎన్నికలను ఆయన ఎదుర్కొన్నారు. వాటిలో ఒకే ఒక్క ఎన్నికల్లో ఓడిపోయారు. అది 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఉమేశ్ జాధవ్ చేతిలో 95,452 ఓట్ల తేడాతో ఓడిపోయారు. విశేషమేంటంటే, ఉమేశ్ జాధవ్ గతంలో ఖర్గేకు ఎన్నికల ఏజెంట్ గా పని చేశారు.
  6. 1999, 2004, 2013లో కర్నాటక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దగ్గరి వరకు వచ్చింది. కానీ సీఎం కాలేకపోయారు. రాజకీయ సమీకరణాల కారణంగా వేరే వారికి ఆ పదవికి అప్పగించాల్సి వచ్చింది.
  7. కేంద్రంలో మన్మోహన్ మంత్రివర్గంలో రైల్వే, కార్మిక శాఖల మంత్రిగా ఉన్నారు. ఇటీవలి వరకు రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు.
  8. ఖర్గేకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతర్లు. కొడుకుల పేర్లు ప్రియాంక్, రాహుల్, మిలింద్. కూతర్ల పేర్లు ప్రియదర్శిని, జయశ్రీ.
  9. ఖర్గే బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు.
  10. ఈ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, తెలుగు, ఇంగ్లీష్ భాషలు వచ్చు.

IPL_Entry_Point