Congress president election results: కింగ్ కాంగ్రెస్ ఖర్గే-mallikarjun kharge is new party chief of congress ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mallikarjun Kharge Is New Party Chief Of Congress

Congress president election results: కింగ్ కాంగ్రెస్ ఖర్గే

HT Telugu Desk HT Telugu
Oct 19, 2022 02:25 PM IST

Congress president election results: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కర్నాటకకు చెందిన సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే ఘన విజయం సాధించారు.

మల్లిఖార్జున్ ఖర్గే (ఫైల్ ఫొటో)
మల్లిఖార్జున్ ఖర్గే (ఫైల్ ఫొటో) (AFP)

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఊహించినట్లే పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే ఘన విజయం సాధించారు. ఖర్గే తో పోటీలో నిలిచిన మాజీ కేంద్ర మంత్రి, కేరళ ఎంపీ శశి థరూర్ ఓటమిని అంగీకరించారు.

ట్రెండింగ్ వార్తలు

Congress president election results: ఎవరికెన్ని ఓట్లు..

అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఓట్లను లెక్కించారు. మొత్తం కాంగ్రెస్ డెలిగేట్స్ సంఖ్య 9,385 కాగా, అందులో 7897 ఓట్లను మల్లిఖార్జున్ ఖర్గే సాధించారు. శశి థరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదు. తమ రాష్ట్రానికి చెందిన మల్లిఖార్జున్ ఖర్గే విజయం సాధించడంపై ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో, కర్నాటకలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నాయి.

Congress president election results: గాంధీయేతర అధ్యక్షుడు

దాదాపు 24 ఏళ్ల తరువాత గాంధీ కుటుంబానికి చెందని నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కర్నాటకకు చెందిన మల్లిఖార్జున్ ఖర్గేకు సీనియర్ నాయకుడిగా, పార్టీలో అందరి వ్యక్తిగా, ట్రబుల్ షూటర్ గా పేరుంది. ముఖ్యంగా, పార్టీలో గాంధీ కుటుంబానికి విధేయుడైన నాయకుడు. అన్ని రాష్ట్రాల్లోని నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్న నాయకుడిగా ఖర్గే కు పేరుంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ఖర్గే నేతృత్వంలోనే కాంగ్రెస్ పోరాడనుంది.

IPL_Entry_Point