4 Women Elope: పథకం సొమ్ము జమకాగానే లవర్లతో నలుగురు మహిళల పరార్.. భర్తలకు చిక్కులు-four women elop with lovers after getting pm awas yojana money leave husbands in shock in uttar pradesh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Four Women Elop With Lovers After Getting Pm Awas Yojana Money Leave Husbands In Shock In Uttar Pradesh

4 Women Elope: పథకం సొమ్ము జమకాగానే లవర్లతో నలుగురు మహిళల పరార్.. భర్తలకు చిక్కులు

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 09, 2023 08:21 AM IST

4 Women Elope in Uttar Pradesh: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకానికి సంబంధించిన సొమ్ము అకౌంట్లో పడగానే నలుగురు మహిళలు.. భర్తను వదిలివెళ్లిపోయారు. దీంతో ఆ భర్తలకు చిక్కులు వచ్చిపడ్డాయి. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (MINT)

4 Women Elope in Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‍లో అరుదైన ఘటన జరిగింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (Pradhan Mantri Awas Yojana - PMAY) కింద బ్యాంక్ అకౌంట్‍లో డబ్బు పడగానే.. నలుగురు మహిళలు తమ లవర్లతో వెళ్లిపోయారు. భర్తలను వదిలేసి పరారయ్యారు. ఆర్థికంగా వెనుకబడిన పేదలు ఇళ్లు నిర్మించుకునేలా ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆవాస్ యోజనను అమలు చేస్తోంది . ఈ పథకం కింద, అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకే విడతల వారీగా ప్రభుత్వం నేరుగా డబ్బు జమ చేస్తుంది. ఇలాగే, ఆ నలుగురు మహిళల అకౌంట్లలోనూ డబ్బు పడగా.. ఆ తర్వాత వారు ఇళ్లు వదిలి తమకు నచ్చివారితో వెళ్లిపోయారు. దీంతో ఆ మహిళల భర్తలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. యూపీలోని బారాబంకీ (Barabanki) జిల్లాలో ఇది జరిగింది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

భర్తలకు నోటీసులు.. ఆందోళన

4 Women Elope in Uttar Pradesh: ఆవాస్ యోజన కింద పథకానికి అప్లై చేసుకుంటే కుటుంబంలోని మహిళ ఇంటికి కో-ఓనర్‌గా ఉండాలి. ఈ పథకం కింద ఆ నలుగురు మహిళలు లబ్ధిదారులయ్యారు. తొలి విడతగా వారి ఖాతాల్లో రూ.50,000 జమ కాగానే.. భర్తలను వదిలి లవర్లతో వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు ఆ నలుగురు భర్తలు చిక్కుల్లో పడ్డారు. ఇంకా ఇళ్ల నిర్మాణం ఎందుకు మొదలుపెట్టలేదని వారికి డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ ఏజెన్సీ (DUDA) నుంచి నోటీసులు వచ్చాయి. అలాగే జమ చేసిన డబ్బు రికవరీ కోసం అధికారుల నుంచి నోటీసులు వస్తాయని కూడా వారు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నిర్మాణం మొదలుపెట్టని కారణంగా వారికి మిగిలిన వాయిదాల మొత్తం జమకాదు.

4 Women Elope in Uttar Pradesh: దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ భర్తలు పడిపోయారు. తమ భార్యల ఖాతాల్లో ఇక డబ్బు జమ చేయవద్దని DUDA అధికారులను కోరారు. వారు తమ వద్ద నుంచి వెళ్లిపోయారని విన్నవించారు. బారాబంకీ జిల్లాలోని బెల్హారా, బంకీ, జైద్‍పూర్, సిద్ధౌర్ నగర పంచాయతీలకు చెందిన వారు ఆ మహిళలు.

ఇలా విషయం బయటికి..

4 Women Elope in Uttar Pradesh: ఇళ్ల నిర్మాణం ఇంకా ఎందుకు మొదలుపెట్టలేదంటూ DUDA అధికారులు నోటీసులు పంపటంతో ఈ విషయమంతా బయటికి వచ్చింది. డుడా ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌరభ్ త్రిపాఠి నోటీసులు పంపిన తర్వాత కూడా ఎలాంటి స్పందన రాలేదు. అయితే, ఆ తర్వాత ఆ నలుగురు మహిళల భర్తలు ప్రభుత్వం కార్యాలయానికి వచ్చి.. విషయాన్ని చెప్పారు. డబ్బు అకౌంట్‍లో పడ్డాక తమ భార్యలు వెళ్లిపోయారని వెల్లడించారు. రెండో ఇన్‍స్టాల్‍మెంట్ తమ భార్యల ఖాతాలో వేయవద్దని కోరారు. అయితే వీరి నుంచి డబ్బును ఎలా రికవరీ చేయాలో తెలియక అధికారులు కూడా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

IPL_Entry_Point