Dog raped in Delhi : ఢిల్లీలో మరో వీధి కుక్కపై అత్యాచారం- 10 రోజుల్లో రెండో ఘటన!-drug addict rapes stray dog in delhi indrapuri area second case in the past 10 days
Telugu News  /  National International  /  Drug Addict Rapes Stray Dog In Delhi Indrapuri Area Second Case In The Past 10 Days
ఢిల్లీలో వీధి కుక్కపై అత్యాచారం.. 10 రోజుల్లో రెండో ఘటన!
ఢిల్లీలో వీధి కుక్కపై అత్యాచారం.. 10 రోజుల్లో రెండో ఘటన!

Dog raped in Delhi : ఢిల్లీలో మరో వీధి కుక్కపై అత్యాచారం- 10 రోజుల్లో రెండో ఘటన!

05 March 2023, 14:59 ISTSharath Chitturi
05 March 2023, 14:59 IST

Dog raped by Delhi man : ఢిల్లీలో మరో వీధి కుక్కపై అత్యాచారం జరిగింది! ఓ వ్యక్తి, ఓ వీధి కుక్కను రేప్​ చేశాడు.

Dog raped in Delhi : ఢిల్లీలో వీధి కుక్కలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి! డ్రగ్స్​కు బానిసైన ఓ వ్యక్తి.. ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో శునకంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత 10 రోజుల్లో ఈ తరహా ఘటన వెలుగులోకి రావడం ఇది రెండోసారి.

ఇదీ జరిగింది..

ఢిల్లీ ఇంద్రపురిలోని జేజే కాలనీ బీ బ్లాక్​లో రాజేశ్​ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. సతీశ్​ అనే వ్యక్తి, రాజేశ్​ పొరుగింట్లో జీవిస్తున్నాడు. కాగా.. ఫిబ్రవరి 28న అతను ఓ వివాహం నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా ఓ షాకింగ్​ ఘటన చూశాడు.

Dog raped by Delhi man : సతీశ్​ అనే వ్యక్తి, ఓ వీధి కుక్కను రేప్​ చేస్తున్న దృశ్యాన్ని చూశాడు రాజేశ్​. ఆ దృశ్యాలను తన ఫోన్​లో బంధించాడు. అనంతరం సమీప పోలీస్​ స్టేషన్​కు వెళ్లి, సతీశ్​పై ఫిర్యాదు చేశాడు. వీడియోను ఆధారంగా చూపించాడు. సతీశ్​ ఒక డ్రగ్​ అడిక్ట్​ని పోలీసులకు వివరించాడు. ఘటనపై సెక్షన్​ 377, 11 యానిమల్​ యాక్ట్​ కింద కేసు నమోదు చేసుకున్నారు ఇంద్రపురి పోలీస్​ స్టేషన్​ అధికారులు. నిందితుడిని వెంటనే అరెస్ట్​ చేసి జైలుకు తీసుకెళ్లారు.

హరి నగర్​లో కుక్కపై అత్యాచారం..

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు, బాలికలకే కాదు.. జంతువులకు కూడా భద్రత లేదు! ఓ ఆడ శునకంపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన కొన్ని రోజుల క్రితం హరి నగర్​లో కలకలం సృష్టించింది. ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

Delhi man raped street dog : నిందితుడికి వివాహమైంది. పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. కొన్ని రోజుల క్రితం అతను హరి నగర్​ ప్రాంతంలోని ఓ పార్కుకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఆడ శునకంపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను చూసి స్థానికులు కొందరు షాక్​ అయ్యారు. వారిలో ఒకరు.. నిందితుడు కుక్కను రేప్​ చేస్తుండటాన్ని వీడియో తీశారు. ఆ వీడియో వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

కుక్క రేప్​నకు గురైన ఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై సెక్షన్​ 377 కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. వీడియో ఆధారంగా నిందితుడి వివరాలు సేకరించారు.

Delhi crime news latest : చివరికి.. నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ప్రస్తుతం అతనిపై విచారణ జరుగుతోంది. కాగా.. గతంలోనూ అతను ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడా? అన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.