Droupadi Murmu : ‘ద్రౌపది- అది నా అసలు పేరు కాదు..'-droupadi not my original name says new president report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Droupadi Not My Original Name, Says New President: Report

Droupadi Murmu : ‘ద్రౌపది- అది నా అసలు పేరు కాదు..'

Sharath Chitturi HT Telugu
Jul 25, 2022 03:27 PM IST

Droupadi Murmu : ద్రౌపది అనేది తన అసలు పేరు కాదని.. నూతన రాష్ట్రపతి వెల్లడించారు. తన పేరును తన టీచర్​ మార్చేశారని వివరించారు.

'ద్రౌపది- అది నా అసలు పేరు కాదు..'
'ద్రౌపది- అది నా అసలు పేరు కాదు..' (PTI)

Droupadi Murmu : ఇప్పుడు వార్తలన్నీ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారంపైనే. భారత దేశ 15వ రాష్ట్రపతిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు ద్రౌపది ముర్ము. అయితే.. ఆమె ఎంత పేరు తెచ్చుకున్నారో.. 'ద్రౌపది' ముర్ము పేరు సైతం అదే స్థాయిలో వార్తల్లో నిలిచింది. మహాభారతంలో ఓ పాత్రకి ద్రౌపది పేరు ఉండటమే ఇందుకు కారణం. అయితే.. ద్రౌపది అనేది తన అసలు పేరు కాదని స్వయంగా ముర్మునే చెప్పారు!

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన కొన్ని రోజుల తర్వాత ఒడియా వీడియో మ్యాగజైన్​కు ఇంటర్వ్యూ ఇచ్చారు ద్రౌపది ముర్ము. ఈ క్రమంలోనే తన పేరు గురించి వివరించారు.

"ద్రౌపది అనేది నా అసలు పేరు కాదు. చిన్నప్పుడు.. నా టీచర్​ నా పేరు మార్చారు. నేను మయూర్​భంజ్​లో నివాసముండేదానిని. ఓ టీచర్​.. వేరే జిల్లా నుంచి వచ్చేవారు. సంథాలి సంప్రదాయం ప్రకారం నా పేరు పుతి. కానీ ఆ టీచర్​.. నా పేరును ద్రౌపదిగా మార్చారు," అని ద్రౌపది ముర్ము వెల్లడించారు.

1960 సమయంలో టీచర్లు.. ఆదివాసీ ప్రాంతాల్లో చదువు చెప్పేందుకు.. బాలాసోర్​, కటక్​ ప్రాంతాల నుంచి వెళ్లేవారు.

Droupadi Murmu biography: "నా అసలు పేరు మా టీచర్​కు నచ్చలేదు. అందుకే నా పేరు మార్చేశారు. ఆ తర్వాత.. నా పేరు దుర్పది- దోర్పదిగానూ మారింది," అని ద్రౌపది ముర్ము వివరించారు.

సంథాలి సంప్రదాయంలో పుట్టిన ఆడబిడ్డకు.. అమ్మమ్మ/నానమ్మ పేరు- మగబిడ్డకు తాతయ్యల పేర్లు పెడుతూ ఉంటారు.

కాగా.. స్కూల్​లో తన ఇంటి పేరు 'టుడు' అని ద్రౌపది ముర్ము వెల్లడించారు. కొన్నేళ్ల తర్వాత.. శ్యామ్​ చరన్​ టుడుతో వివాహమైందని, ఆ తర్వాత.. ఇంటి పేరును తానే ముర్ముగా మార్చుకున్నట్టు స్పష్టం చేశారు.

రాష్ట్రపతి ముర్ము..

విపక్షాల అభ్యర్థి యశ్వంత్​ సిన్హాతో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల పోరులో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. తాజాగా.. రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రపతిగా కొనసాగిన రామ్​నాథ్​ కొవింద్​.. ఆ పదవి నుంచి తప్పుకుని, రాజ్​భవన్​కు ఖాళీ చేసి వెళ్లిపోయారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం