DRDO Recruitment 2023 : డీఆర్డీఓలో అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్..
DRDO Recruitment 2023 : డీఆర్డీఓలో అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ పడింది. 75 పోస్టులకు రిక్రూట్మెంట్ జరగనుంది. పూర్తి వివరాలు..
DRDO Recruitment 2023 : అప్రెంటీస్ పోస్టుల అప్లికేషన్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్). అభ్యర్థులు తమ అప్లికేషన్‌ను mhrdnats.gov.in లో సబ్మీట్ చేసుకోవచ్చు. ఈ దఫా రిక్రూట్మెంట్లో 75 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తోంది డీఆర్డీఓ. అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కాగా మే 30తో ప్రక్రియ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సెలక్షన్ ప్రక్రియ, ఎలిజబులిటీ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
ట్రెండింగ్ వార్తలు
డీఆర్డీఓలో ఉద్యోగాలు..
వేకెన్సీ వివరాలు:-
గ్రాడ్జ్యూయేట్ ఇంజినీర్ అప్రెంటీసెస్:- 50 పోస్టులు
డిప్లొమా అప్రెంటీసెస్- 25 పోస్టులు
ఎలిజబులిటీ:-
DRDO Recruitment 2023 notification : గ్రాడ్జ్యూయేట్ అప్రెంటీస్- 6.3 సీజీపీఏతో ఫస్ట్ క్లాస్ ఇంజినీరింగ్ డిగ్రీ.
టెక్నీషియన్ అప్రెంటీస్:- స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్జ్యుకేషన్ లేదా ఏదైనా రికగ్నీషన్ ఉన్న భారతీయ యూనివర్సిటీ నుంచి 60శాతం మార్కులతో ఇంజినీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా.
ఇదీ చూడండి:- SBI Recruitment 2023 : ఎస్బీఐలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి..
సెలక్షన్ ప్రక్రియ:-
క్వాలిఫికేషన్ కోసం రాత పరీక్షను నిర్వహిస్తారు. తుది మెరిట్ లిస్ట్‌ను జనరల్/ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ కేటగిరీలకు తగ్గట్టు రూపొందిస్తారు.
DRDO Recruitment 2023 Apprentice posts : డీఆర్డీఓ అప్రెంటీస్‌షిప్ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ట్రైనింగ్ వ్యవధి:-
అప్రెటీస్షిప్ ట్రైనింగ్ 12 నెలల పాటు ఉంటుంది. పాసైన అభ్యర్థులకు సర్టిఫికేట్‌ను ఇస్తారు.
ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు..
Indian Bank Recruitment 2023 : స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఇండియన్ బ్యాంక్. ఈ దఫా రిక్రూట్మెంట్లో 18 వేకెన్సీలను భర్తీ చేయనుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఇండియాన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ indianbank.in లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 29 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2023 ఎలిజెబులిటీ, సెలక్షన్ ప్రక్రియ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం