Indian Bank Recruitment 2023 : ఇండియన్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
Indian Bank Recruitment 2023 : స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఇండియన్ బ్యాంక్. ఇందులోని పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Indian Bank Recruitment 2023 : స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఇండియన్ బ్యాంక్. ఈ దఫా రిక్రూట్మెంట్లో 18 వేకెన్సీలను భర్తీ చేయనుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఇండియాన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ indianbank.in లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 29 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2023 ఎలిజెబులిటీ, సెలక్షన్ ప్రక్రియ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వేకెన్సీ వివరాలు..
- ప్రాడక్ట్ మేనేజర్- 5 పోస్టులు
- Indian Bank Recruitment 2023 notification : టీమ్ లీడ్- 7 పోస్టులు
- ఛార్టడ్ అకౌంటెంట్- 6 పోస్టులు
ఎలిజబులిటీతో పాటు వయస్సు పరిమితి, వర్కింగ్ లొకేషన్ వంటి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సెలక్షన్ ప్రక్రియ..
Indian Bank Recruitment 2023 apply online : ఎలిజబులిటీ, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్‌తో పాటు ఇంటర్వ్యూలో ప్రదర్శన ఆధారంగా తుది సెలక్షన్ ఉంటుంది. ఇంటర్వ్యూను నిపుణుల కమిటి నిర్వహిస్తుంది.
ఎక్కడ అప్లై చేయాలి..
ఆన్లైన్లో అప్లై చేసిన అనంతరం సంబంధిత పత్రాలను చీఫ్ జనరల్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ ఆఫీస్, హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్, రిక్రూట్మెంట్ సెక్షన్ 254- 260, అవ్వాయ్ షన్ముగమ్ సలై, రోయపెట్ట, చెన్నై, పిన్‌కోడ్ - 600014, తమిళనాడు అడ్రెస్‌కు పంపించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు..
ఇండియాన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2023 కోసం అప్లికేషన్ ఫీజు రూ. 1000. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోండి.
ఎస్బీఐ రిక్రూట్మెంట్ 2023..
SBI Recruitment 2023 : స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీర్స్కు చెందిన వివిధ రెగ్యూలర్, కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డేటా, టెక్, టెస్టింగ్‌తో పాటు ఇతర విభాగాల్లోని అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ వంటి పోస్టులను ఈ దఫా రిక్రూట్మెంట్లో భర్తీ చేయనుంది ఎస్బీఐ. ఈ మేరకు అప్లికేషన్ ప్రక్రియ ఈ నెల 16నే మొదలైపోయింది. జూన్ 5తో అప్లికేషన్ గడువు ముగుస్తుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్లను bank.sbi/careers లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం