CUET UG 2023: సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ షురూ.. డైరెక్ట్ లింక్ ఇదే-cuet ug 2023 registration begins at cuet samarth find direct link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet Ug 2023: సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ షురూ.. డైరెక్ట్ లింక్ ఇదే

CUET UG 2023: సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ షురూ.. డైరెక్ట్ లింక్ ఇదే

HT Telugu Desk HT Telugu
Feb 10, 2023 09:39 AM IST

CUET UG 2023 registration: సీయూఈటీ యూజీ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకునే విధానం, డైరెక్ట్ లింక్ ఇక్కడ చూడండి

CUET UG 2023: సీయూఈటీ యూజీ 2023 కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
CUET UG 2023: సీయూఈటీ యూజీ 2023 కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

CUET UG 2023: సీయూఈటీ యూజీ 2023 కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో అడ్మిషన్ కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులు CUET UG అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ఏదైనా సెంట్రల్ యూనివర్శిటీలు లేదా ఇతర యూనివర్శిటీ (స్టేట్ యూనివర్సిటీలు, డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలతో సహా)ల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు CUET (UG) సింగిల్ విండో అవకాశాన్ని అందిస్తుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 12, 2023.

CUET UG 2023: సీయూఈటీ కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలి

సీయూఈటీ పరీక్ష కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు కింద సూచించిన స్టెప్స్ అనుసరించవచ్చు.

1. CUET UG అధికారిక సైట్‌ని cuet.samarth.ac.in సందర్శించండి.

2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న CUET UG 2023 లింక్‌పై క్లిక్ చేయండి.

3. రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి ఖాతాకు లాగిన్ చేయండి.

4. దరఖాస్తు ఫారం నింపి దరఖాస్తు రుసుము చెల్లించండి.

5. పూర్తయిన తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

6. పేజీని డౌన్‌లోడ్ చేయండి. తదుపరి అవసరాల కోసం ప్రింటవుట్ తీసి ఉంచండి.

మూడు సబ్జెక్టుల వరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ కేటగిరీకి చెందిన వారైతే రూ. 750, ఓబీసీ కేటగిరీకి చెందిన వారైతే రూ. 700, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అయితే రూ. 650 చెల్లించాలి. భారత దేశం వెలుపలి పరీక్షా కేంద్రాలైతే రూ. 3,750 చెల్లించాలి.

7 సబ్జెక్టులకు దరఖాస్తు చేయడానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 1500, OBC కేటగిరీ రూ. 1400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ కేటగిరీల అభ్యర్థులు రూ. 1300 చెల్లించాలి. భారతదేశం వెలుపల ఉన్న పరీక్షా కేంద్రాలకైతే రూ. 7,500 చెల్లించాలి.

10 సబ్జెక్టుల దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ కేటగిరీ రూ. 1750, ఓబీసీ అభ్యర్థులు రూ. 1650, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ. 1550 చెల్లించాలి. భారతదేశం వెలుపల ఉన్న కేంద్రాలకైతే రూ. 11000 చెల్లించాలి.

IPL_Entry_Point

టాపిక్