CTET Admit Card 2023: సీటెట్ రీ షెడ్యూల్డ్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ రెడీ..-ctet admit card 2023 released for rescheduled exam dates download link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ctet Admit Card 2023 Released For Rescheduled Exam Dates, Download Link Here

CTET Admit Card 2023: సీటెట్ రీ షెడ్యూల్డ్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ రెడీ..

HT Telugu Desk HT Telugu
Jan 28, 2023 04:13 PM IST

CTET Admit Card 2023: సీటెట్ రివైజ్డ్ అడ్మిట్ కార్డ్స్ ను అర్హులైన అభ్యర్థులు ctet.nic.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

CTET Admit Card 2023: సీటెట్ (CTET) రివైజ్డ్ అడ్మిట్ కార్డ్స్ ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education CBSE) విడుదల చేసింది. వాటిని సీటెట్ (CTET) అధికారిక వెబ్ సైట్ ctet.nic.in వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

CTET Admit Card 2023: ఇవి రివైజ్డ్ అడ్మిట్ కార్డ్స్

నిజానికి జనవరి 11, 18, 24 తేదీల్లో జరగాల్సిన పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ అడ్మిట్ కార్డ్స్ ఇవి. ఆ తేదీల్లో జరగాల్సిన పరీక్ష కొన్ని సెంటర్లలో సాంకేతిక కారణాల వల్ల జరగలేదు. దాంతో, ఆ పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు. ఆ రీషెడ్యూల్డ్ పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ అడ్మిట్ కార్డ్స్ ను సీబీఎస్సీ శనివారం విడుదల చేసింది. వాటిని అభ్యర్థులు ctet.nic.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

CTET Admit Card 2023: డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?

  • ముందుగా సీబీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ctet.nic.in ను సందర్శించాలి.
  • హోం పేజీపై ఉన్న TET Admit Card 2023 లింక్ పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ డిటైల్స్ ను ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
  • అడ్మిట్ కార్డ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • అడ్మిట్ కార్డ్ పై వివరాలను చెక్ చేసుకుని, అనంతరం ఆ అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అడ్మిట్ కార్డ్ ను ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
  • ఈ పరీక్ష రాయడానికి మరో అవకాశం లభించబోదని సీబీఎస్సీ స్పష్టం చేసింది.

Direct link to download CTET Admit Card 2023

IPL_Entry_Point

టాపిక్