CMAT 2023 Results : సీమ్యాట్ రిజల్ట్స్ వచ్చేశాయి.. చెక్ చేసుకోండిలా!-cmat 2023 results announced download scorecard on cmat nta nic in ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cmat 2023 Results : సీమ్యాట్ రిజల్ట్స్ వచ్చేశాయి.. చెక్ చేసుకోండిలా!

CMAT 2023 Results : సీమ్యాట్ రిజల్ట్స్ వచ్చేశాయి.. చెక్ చేసుకోండిలా!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 01, 2023 11:42 AM IST

CMAT 2023 Results: సీమ్యాట్ 2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

CMAT 2023 Results : సీమ్యాట్ రిజల్ట్స్ వచ్చేశాయి.. చెక్ చేసుకోండిలా! /(iStockphoto) (HT Photo)
CMAT 2023 Results : సీమ్యాట్ రిజల్ట్స్ వచ్చేశాయి.. చెక్ చేసుకోండిలా! /(iStockphoto) (HT Photo)

CMAT 2023 Results: కామన్ మేనేజ్‍మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT) 2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రిజల్ట్స్ వెల్లడించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు cmat.nta.nic.in వెబ్‍సైట్‍లో ఫలితాలను చెక్ చేసుకొని, స్కోర్ కార్డ్ డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ మేనేజ్‍మెంట్ కోర్సుల్లో (ఎంబీఏ/పీజీడీఎం) బిజినెస్ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులకు ఎన్‍టీఏ ఈ సీమ్యాట్ పరీక్ష నిర్వహించింది. ఈ సీమ్యాట్ పరీక్ష ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.

ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో మేనేజ్‍మెంట్ కోర్సుల్లో అడ్మిషన్‍ల కోసం ఈ సీమ్యాట్ పరీక్ష మే 4వ తేదీన దేశవ్యాప్తంగా జరిగింది. మొత్తంగా ఈ పరీక్షకు 75,209 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 58,035 పరీక్షకు హాజరయ్యారు.

దేశవ్యాప్తంగా 126 నగరాల్లోని 248 సెంటర్లలో సీమ్యాట్ 2023 పరీక్ష జరిగింది. లైవ్ సీసీ టీవీల పర్యవేక్షణ, జామర్ల ఏర్పాటు మధ్య కట్టుదిట్టంగా ఈ టెస్ట్ జరిగింది. మొత్తంగా 260 మంది అబ్జర్వర్లు, 122 సిటీ కో-ఆర్డినేటర్లు, 18 మంది రీజనల్ కో-ఆర్డినేటర్లు, ఇద్దరు నేషనల్ కో-ఆర్డినేటర్లతో ఈ పరీక్షను ఎన్‍టీఏ నిర్వహించింది.

సీమ్యాట్ 2023 రిజల్ట్స్ డౌన్‍లోడ్ చేసుకోండిలా..

  • ముందుగా ఎన్‍టీఏ సీమ్యాట్ అధికారిక వెబ్‍సైట్ cmat.nta.nic.in లోకి వెళ్లండి.
  • హోం పేజీలోని క్యాండిడేట్ యాక్టివిటీలో CMAT 2023 score Card అనే లింక్ కనిపిస్తుంది.
  • ఆ లింక్‍పై క్లిక్ చేశాక ఓ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో సీమ్యాట్ 2023 అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, అక్కడే ఉండే సెక్యూరిటీ పిన్‍ను ఎంటర్ చేయాలి.
  • అనంతరం అక్కడే కింద ఉండే లాగిన్ బటన్‍పై క్లిక్ చేయాలి.
  • మీ స్కోర్ కార్డు స్క్రీన్‍పై కనిపిస్తుంది. స్కోర్ కార్డును డౌన్‍లోడ్ చేసుకొని ప్రింట్ ఔట్ తీసుకోండి.