Satyendar Jain gets foot massage in Tihar jail: జైళ్లో జైన్ కు వీఐపీ మర్యాదలు-bjp targets aap over video of satyendar jain getting massage in tihar jail ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bjp Targets Aap Over Video Of Satyendar Jain Getting Massage In Tihar Jail

Satyendar Jain gets foot massage in Tihar jail: జైళ్లో జైన్ కు వీఐపీ మర్యాదలు

HT Telugu Desk HT Telugu
Nov 19, 2022 04:17 PM IST

Satyendar Jain gets foot massage in Tihar jail: ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు ఢిల్లీలోని తిహార్ జైళ్లో అతిధి మర్యాదలు లభిస్తున్నాయి. జైలు గదిలో ఒక వ్యక్తితో జైన్ కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో తాజాగా వైరల్ అయింది.

జైలు గదిలో సత్యేంద్ర జైన్ కాలుకు మసాజ్ చేస్తున్న దృశ్యం
జైలు గదిలో సత్యేంద్ర జైన్ కాలుకు మసాజ్ చేస్తున్న దృశ్యం

Delhi ex minister Jain gets VIP treatment in Tihar jail: మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రస్తుతం తిహార్ జైళ్లో ఉన్నారు. జైళ్లో ఆయనకు సకల సౌకర్యాలతో అతిథి మర్యాదలు లభిస్తున్నాయని చాన్నాళ్లుగా బీజేపీ ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని ఈడీ కూడా కోర్టుకు తెలిపింది. ఢిల్లీలోని జైళ్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. మనీ లాండరింగ్, అక్రమాస్తుల ఆరోపణలపై సత్యేంద్ర జైన్ ప్రస్తుతం తిహార్ జైళ్లో విచారణ ఖైదీగా ఉన్నారు.

Jain's foot massage video viral: వైరల్ వీడియో..

జైలు గదిలో మంచంపై సత్యేంద్ర జైన్ పడుకుని ఉండగా, ఒక వ్యక్తి ఆయన కాళ్లకు మసాజ్ చేస్తున్న దృశ్యాలున్న వీడియో వైరల్ అయింది. అక్కడే మరి కొందరితో జైన్ మాట్లాడుతున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి. ఈ వీడియోతో ఆప్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి బీజేపీకి మంచి ఆయుధం లభించినట్లైంది. జైల్లోని సీసీ టీవీలో సెప్టెంబర్ 13న ఈ వీడియో రికార్డైంది. ఈ వీడియో ఆధారంగా సత్యేంద్ర జైన్ పై బీజేపీ నేతలు పోలీసు కేసు పెట్టారు.

Its treatment for spine surgery: వెన్నెముక సర్జరీ

ఈ వీడియోను లీక్ చేసి, తప్పుడు కథనాలను అల్లుతోందని ఆప్ విమర్శించింది. సత్యేంద్ర జైన్ కు వెన్నెముకకు ఆపరేషన్ అయిందని, వైద్య చికిత్సలో భాగంగా మసాజ్ కు జైలు అధికారులు అనుమతించారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా వివరించారు. తప్పుడు ఆరోపణలతో తమ నాయకుడిని బీజేపీ అరెస్ట్ చేయించిందని ఆరోపించారు. ‘గత ఆరు నెలలుగా జైన్ జైలులో ఉన్నాడు. జైలులో ఉండగా, కాలు జారి కింద పడ్డారు. అప్పుడు వెన్నెముకకు గాయమైంది. ఆ గాయానికి రెండు సార్లు సర్జరీ కూడా జరిగింది. జైళ్లో కూడా ఫిజియోథెరపీ ని కొనసాగించాలని డాక్టర్లు సూచించారు. అదేం బాడీ మసాజ్ కాదు. ఖైదీలకు కూడా వైద్య చికిత్స పొందే హక్కు ఉంటుంది’’ అని సిసోడియా వివరించారు.

BJP slams AAP govt: ఖైదీ యూనీఫాం ఎందుకు లేదు?

కాగా, ఈ వీడియోను ఆధారంగా చూపుతూ ఆప్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. జైళ్లో జైన్ వీఐపీ ట్రీట్ మెంట్ పొందుతున్నారని విమర్శించింది. ఖైదీలు ధరించే యూనిఫామ్ ఆయన ఎందుకు వేసుకోలేదని బీజేపీ నేత గౌరవ్ భాటియా ప్రశ్నించారు. ‘‘జైళ్లో ఖైదీకి మసాజ్ సౌకర్యం ఎలా కల్పిస్తారు? జైన్ ఉన్న సెల్ లో చాలామంది కనిపిస్తున్నారు. వారందరినీ జైళ్లోకి ఎలా అనుమతించారు?’’ అని ప్రశ్నించారు. సత్యేంద్ర జైన్ కు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలపై గతంలో తిహార్ జైలు సూపరింటెండెంట్ సస్పెండ్ కూడా అయ్యారు.

IPL_Entry_Point