Bharti Airtel Q1 results : ఎయిర్​టెల్​ నికర లాభం.. 466శాతం జంప్​​!-bharti airtel q1 net profit jumps 466 percent arpu rises to rs 183 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bharti Airtel Q1 Results : ఎయిర్​టెల్​ నికర లాభం.. 466శాతం జంప్​​!

Bharti Airtel Q1 results : ఎయిర్​టెల్​ నికర లాభం.. 466శాతం జంప్​​!

Sharath Chitturi HT Telugu
Aug 08, 2022 05:01 PM IST

Bharti Airtel Q1 results : ఎయిర్​టెల్​ క్యూ1 ఫలితాలు మెరుగ్గా నమోదయ్యాయి! నికర లాభం 466శాతం వృద్ధి చెందింది.

క్యూ1 ఫలితాలను విడుదల చేసిన భారతీ ఎయిర్​టెల్​
క్యూ1 ఫలితాలను విడుదల చేసిన భారతీ ఎయిర్​టెల్​ (Bloomberg)

Bharti Airtel Q1 results : 2022-23 మొదటి త్రైమాసిక ఫలితాలను సోమవారం ప్రకటించింది భారతీ ఎయిర్​టెల్​. కన్సాలిడేటెడ్​ నెట్​ ప్రాఫిట్(నికర లాభం)​ 465.81శాతం పెరిగి రూ. 1,606.9కు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నెట్​ ప్రాఫిట్​ విలువ రూ.283.50కోట్లుగా ఉండేది.

ఎయిర్​టెల్​ ఆపరేషన్ల ద్వారా వచ్చిన కన్సాలిడేటెడ్​ రెవెన్యూ రూ. 32,805కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం రూ. 26,854కోట్లుగా నమోదైంది.

ఏప్రిల్​- జూన్​ క్యూ1 త్రైమాసికంలో మొబైల్​ సర్వీసెస్​ నుంచి ఎయిర్​టెల్​కు వచ్చిన ఆదాయం 27శాతం వృద్ధి చెంది.. రూ. 18,220కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 14,306గా ఉండేది.

ఇక టెలికాం సంస్థల్లో అత్యంత కీలకంగా చూసే ఆర్​పూ(యావరేజ్​ రెవెన్యూ పర్​ యూజర్​).. కూడా ఎయిర్​టెల్​కు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆర్​పూ రూ. 146గా ఉండగా.. ఈసారి అది రూ. 183కి చేరింది.

కన్సాలిడేటెడ్​ ఎబిట్​డా రూ. 16,604కోట్లుగా నమోదైంది. ఎబిట్​డా మార్జిన్​ 50.6శాతంగా ఉంది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి ఎయిర్​టెల్​ షేరు ధర రూ. 704.95కి చేరింది.

5జీ కోసం..

మరోవైపు.. 5జీని ప్రజలకు అందించేందుకు ఎయిర్​టెల్​ కృషిచేస్తోంది. వచ్చే నెలలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు సన్నద్ధమవుతోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం