Teacher refuses to hoist flag: ``జెండా వంద‌నం చేయ‌ను.. మా మతం ఒప్పుకోదు``-amil nadu s government school s headmistress refused to hoist the national flag during independence day event ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Amil Nadu's Government School's Headmistress Refused To Hoist The National Flag During Independence Day Event

Teacher refuses to hoist flag: ``జెండా వంద‌నం చేయ‌ను.. మా మతం ఒప్పుకోదు``

HT Telugu Desk HT Telugu
Aug 17, 2022 08:10 PM IST

Teacher refuses to hoist flag: ప్ర‌భుత్వ పాఠ‌శాల ప్ర‌ధాన ఉపాధ్యాయురాలు స్వతంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా జెండా వంద‌నం చేయ‌డానికి నిరాక‌రించిన ఘ‌ట‌న త‌మిళ‌నాడులో జ‌రిగింది. త‌మ మ‌త విశ్వాసాలు అందుకు ఒప్పుకోవ‌ని, దేవుడికి త‌ప్ప మరెవ‌రికీ తాము వంద‌నం చేయ‌బోమ‌ని ఆమె వివ‌ర‌ణ ఇచ్చారు.

ప్ర‌ధాన ఉపాధ్యాయురాలు త‌మిళ‌సెల్వి
ప్ర‌ధాన ఉపాధ్యాయురాలు త‌మిళ‌సెల్వి

Teacher refuses to hoist flag: స్వ‌తంత్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్బంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ జ‌రుపుకుంటున్నాం. ఆగ‌స్ట్ 15న మునుపెన్న‌డు లేనంత ఆనందోత్సాహాల‌తో గ్రామ‌గ్రామానా, వాడ‌వాడ‌లా జెండా పండుగ చేసుకున్నాం. అయితే, త‌మిళ‌నాడులోని ఒక ప్ర‌భుత్వ పాఠ‌శాల ప్ర‌ధాన ఉపాధ్యాయురాలు మాత్రం త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగ‌రేయ‌బోన‌ని, జెండాకు సెల్యూట్ చేయ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Teacher refuses to hoist flag: డీఈఓకు ఫిర్యాదు..

జెండా వంద‌నం చేయ‌బోన‌ని చెబుతూ ఆ ప్ర‌ధానోపాధ్యాయురాలు పంపిన వీడియో సందేశం వైర‌ల్ అయింది. దాంతో, ఆమెపై జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురి జిల్లాలోని ఒక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో త‌మిళ‌సెల్వి ప్ర‌ధాన ఉపాధ్యాయురాలిగా ప‌ని చేస్తున్నారు. ప్ర‌ధాన ఉపాధ్యాయురాలి హోదాలో ఆమె ఆగ‌స్ట్ 15న స్కూల్‌లో జెండావంద‌నం చేయాల్సి ఉండ‌గా, సెల‌వు పెట్టి ఆ కార్య‌క్ర‌మానికి ఆమె గైర్హాజ‌ర‌య్యారు. అందుకు కార‌ణం వివ‌రిస్తూ స్టాఫ్‌కు ఆమె ఒక వీడియో సందేశం పంపారు.

Teacher refuses to hoist flag: నేను క్రిస్టియ‌న్‌ను..

తాను క్రిస్టియ‌న్‌న‌ని, దేవుడికి త‌ప్ప మ‌రెవ‌రికీ వంద‌నం చేయ‌డానికి త‌మ మ‌తం ఒప్పుకోద‌ని, అందువ‌ల్ల తాను జెండావంద‌నం చేయ‌లేన‌ని ఆమె ఆ వీడియోలో వివ‌రించారు. త‌న‌కు బ‌దులుగా అసిస్టెంట్ హెడ్‌మాస్ట‌ర్‌తో ప‌తాకావిష్క‌ర‌ణ చేయించాల‌ని సూచించారు. `నేను యాకోబా క్రిస్టియ‌న్‌ను. మేం విశ్వ‌సించే దేవుడికి త‌ప్ప మ‌రెవ‌రికీ మేం న‌మ‌స్క‌రించం. నేను మా మ‌త విశ్వాసాల‌ను పూర్తిగా అనుస‌రిస్తాను. నాకు జాతీయ ప‌తాకంపై గౌర‌వం ఉంది. జాతీయ జెండాను అవ‌మానించే ఉద్దేశం లేదు. కానీ మా మతం ఒప్పుకోదు కాబ‌ట్టి జెండా వంద‌నం చేయ‌లేను` అని త‌మిళ సెల్వి ఆ వీడియోలో వివ‌రించారు. ఈ సంవ‌త్సరం త‌మిళ‌సెల్వి రిటైర్ అవుతున్నారు. గ‌తంలో జెండా వంద‌నం చేయాల్సిన రోజుల్లో కూడా త‌మిళ‌సెల్వి సెలవు పెట్టేవార‌ని స్కూల్ స్టాఫ్ వివరించారు.

IPL_Entry_Point