Shraddha Walkar Murder Case: ‘నన్ను ముక్కలుగా నరికేస్తానని బెదిరిస్తున్నాడు’: 2020లోనే ఆఫ్తాబ్‍పై శ్రద్ధ ఫిర్యాదు-aaftab threatens to cut me in to pieces shraddha walker wrote letter to police in 2020 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Aaftab Threatens To Cut Me In To Pieces Shraddha Walker Wrote Letter To Police In 2020

Shraddha Walkar Murder Case: ‘నన్ను ముక్కలుగా నరికేస్తానని బెదిరిస్తున్నాడు’: 2020లోనే ఆఫ్తాబ్‍పై శ్రద్ధ ఫిర్యాదు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 23, 2022 03:04 PM IST

Shraddha Walkar Murder Case: తనను చంపేస్తానని, ముక్కలుగా నరికేస్తానని ఆఫ్తాబ్ బెదిరిస్తున్నాడంటూ రెండు సంవత్సరాల క్రితమే శ్రద్ధా వాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లెటర్‌కు సంబంధించిన ఫొటో ఇప్పుడు బయటికి వచ్చింది.

ఆఫ్తాబ్ పునావాలా, శ్రద్ధా వాకర్ (HT Photo)
ఆఫ్తాబ్ పునావాలా, శ్రద్ధా వాకర్ (HT Photo)

Shraddha Walkar Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో కొత్తకొత్త విషయాలు నిత్యం బయటికి వస్తూనే ఉన్నాయి. తన ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పునావాలా తనను ముక్కలుగా నరికేస్తానని బెదిరిస్తున్నాడంటూ హత్యకు గురయ్యే రెండు సంవత్సరాల క్రితమే శ్రద్ధ.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తాజాగా వెల్లడైంది. 2020 నవంబర్‌లోనే ఆఫ్తాబ్‍పై శ్రద్ధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కంప్లయింట్‍ లెటర్‌కు సంబంధించి ఫొటో తాజాగా బయటికి వచ్చింది. ‘నన్ను ముక్కలుగా నరికి, పడేస్తా అని ఆఫ్తాబ్ బెదిరిస్తున్నాడు’ అంటూ అప్పుడు శ్రద్ధ ఫిర్యాదు చేయగా.. ఈ ఏడాది మే 18న ఆమె అదే రీతిలో హత్యకు గురయ్యారు. ఆ కంప్లయింట్‍లో ఆఫ్తాబ్ గురించి శ్రద్ధ ఏం చెప్పారంటే..

ట్రెండింగ్ వార్తలు

‘ఆరు నెలల నుంచి కొడుతున్నాడు’

Shraddha Walkar Murder Case: “ఊపిరాడకుండా చేసి ఈరోజు నన్ను చంపాలని ప్రయత్నించాడు. నన్ను భయపెడుతున్నాడు. చంపి, ముక్కముక్కలుగా చేసి పాడేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు” అని ఆ కంప్లయింట్ లెటర్‌లో శ్రద్ధ పేర్కొన్నారు. “అతడు నన్ను ఆరు నెలలుగా కొడుతూనే ఉన్నాడు. అయితే పోలీసులకు చెప్పే ధైర్యం నాకు రాలేదు. ఎందుకంటే నన్ను చంపేస్తానని అతడు బెదిరిస్తున్నాడు” అని 2020 నవంబర్ 23న లేఖలో శ్రద్ధ రాశారు. ముంబై సమీపంలోని వాసాయ్‍లో ఉంటున్న శ్రద్ధ స్నేహితురాలు ఈ లేఖను షేర్ చేశారని, కంప్లయింట్ ఇచ్చేందుకు శ్రద్ధ వెంట ఆమె కూడా వెళ్లారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. ఈ లేఖను మహారాష్ట్ర పోలీసులు కూడా ధ్రువీకరించారని తెలిపింది.

‘ఆఫ్తాబ్ తల్లిదండ్రులకు కూడా తెలుసు’

Shraddha Walkar Murder Case: ఆఫ్తాబ్ తనను వేధిస్తున్నాడని అతడి తల్లిదండ్రులకు కూడా తెలుసునని ఆ లేఖలో శ్రద్ధ రాశారు. “అతడు నన్ను వేధిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని అతడి తల్లిదండ్రులకు కూడా తెలుసు. మేం కలిసి జీవిస్తున్నామని వాళ్లకు కూడా తెలుసు. ఎందుకంటే వీకెండ్స్ లో వారు వచ్చేవారు. పెళ్లికి ఆఫ్తాబ్ కుటుంబ సభ్యుల అంగీకారం ఉంది కాబట్టే మేం అతడితో కలిసి ఉంటున్నాను” ఆ లేఖలో శ్రద్ధ తెలియజేశారు. ఆఫ్తాబ్‍తో విడిపోవాలని కూడా అనుకుంటున్నట్టు శ్రద్ధ వివరించారు. “ఇక నుంచి నేను అతడితో కలిసి జీవించాలని అనుకోవడం లేదు. కాబట్టి నాపై ఏదైనా శారీరక దాడిని జరిగితే అతడే బాధ్యుడని పరిగణించండి. ఎందుకంటే అతడు నన్ను హింసిస్తానని చంపుతానని బెదిరిస్తున్నాడు” అని ఫిర్యాదు లేఖలో రాశారు శ్రద్ధ.

శ్రద్ధ ఇదివరకే ఆఫ్తాబ్‍పై పోలీసులకు ఫిద్యాదు చేసిందని ఆమె మాజీ సహోద్యోగి కరణ్ కూడా ఇటీవల వెల్లడించారు. అయితే ఆఫ్తాబ్ తల్లిదండ్రులు నచ్చజెప్పటంతో శ్రద్ధ ఆ కేసును ముందుకు తీసుకెళ్లలేదని తెలిపారు.

ఈ ఏడాది మే 18న ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్ పునావాలా అత్యంత కిరాతకంగా హతమార్చాడు. గొంతు నులిమి చంపి.. ఆ తర్వాత శరీరాన్ని 35 ముక్కలుగా నరికి కొన్ని రోజులుగా అడవిలో పడేశాడు. ఈ విషయాన్ని ఇటీవల కోర్టు ముందు కూడా ఆఫ్తాబ్ అంగీకరించాడు.

2020లో ఆఫ్తాబ్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శ్రద్ధా వాకర్ రాసిన లేఖ
2020లో ఆఫ్తాబ్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శ్రద్ధా వాకర్ రాసిన లేఖ
IPL_Entry_Point

టాపిక్