Maharashtra crime news : తల్లి సహజీవనం చేస్తున్న వ్యక్తిని దారుణంగా చంపిన తనయుడు!-23yearold man bludgeons mothers live in partner to death in maharashtra ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  23-year-old Man Bludgeons Mother's Live-in Partner To Death In Maharashtra

Maharashtra crime news : తల్లి సహజీవనం చేస్తున్న వ్యక్తిని దారుణంగా చంపిన తనయుడు!

తల్లి సహజీవనం చేస్తున్న వ్యక్తిని దారుణంగా చంపిన తనయుడు
తల్లి సహజీవనం చేస్తున్న వ్యక్తిని దారుణంగా చంపిన తనయుడు

Maharashtra crime news : మహారాష్ట్ర పాల్గఢ్​లో ఓ యువకుడు.. తన తల్లి సహజీవనం చేస్తున్న వ్యక్తి చంపేశాడు. బండరాయితో అతడి తలపై బాది హత్య చేశాడు.

Maharashtra crime news : తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి, ఆమెను దారుణంగా కొడుతుండటాన్ని ఆ యువకుడు భరించలేకపోయాడు. తల్లి బాధను చూసి.. చివరికి ఆ వ్యక్తినే చంపేశాడు. బండరాయితో తల బాది హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

పాల్గఢ్​ జిల్లాలోని వీరేంద్ర నగర్​లో ఓ మహిళ.. తన కుమారుడితో జీవిస్తోంది. అతని వయస్సు 23ఏళ్లు. స్థానికంగా కూరగాయలు అమ్ముకుంటూ జీవితాన్ని సాగిస్తోంది. కాగా ఆమె ఓ వ్యక్తితో 4ఏళ్లుగా సహజీవనం చేస్తోంది.

Man kills mother's live in partner : అయితే.. వారిద్దరి మధ్య అనేకమార్లు గొడవలు జరిగాయి. ఆ వ్యక్తి.. మహిళను అనేక మార్లు దారుణంగా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న విషయాలపై గొడవ పడి, కొట్టేవాడు. ఆ వ్యక్తి.. తన తల్లిని కొడుతుండటం ఆమె కుమారుడికి నచ్చలేదు. అనేక సందర్భాల్లో తనని తాను నియంత్రించుకున్నాడు.

కాగా.. గురువారం రాత్రి మహిళ, సహజీవనం చేస్తున్న వ్యక్తికి మధ్య మళ్లీ గొడవ జరిగింది. మహిళను అతను కొట్టడం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న 23ఏళ్ల యువకుడు.. తన తల్లిపై జరుగుతున్న దాడిని చూశాడు. కోపంతో ఊగిపోయాడు. వెంటనే పక్కనే ఉన్న బండరాయిని తీసుకుని ఆ వ్యక్తి తలపై బాదాడు. చివరికి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Palghar murder news : ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా.. కుమారుడిపై ఆ మహిళే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 23ఏళ్ల నిందితుడిని అరెస్ట్​ చేసి ఐపీసీ సెక్షన్​ 302 కింద కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసినట్టు వివరించారు.

హైకోర్టు ఎదుటే హత్య..!

Hyderabad murder case : హైదరాబాద్ లో పది వేల రూపాయల కోసం జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసింది. హైకోర్టు ముందే ఈ దారుణం జరిగింది. తెలంగాణ హైకోర్టు గేట్‌ నంబర్‌ 6 వద్ద ఓ వ్యక్తిని అందరూ చూస్తుండగానే దుండగుడు కత్తితో అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే వ్యక్తిని కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు. రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు అంటున్నారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అప్పటికే బాధితుడు మృతిచెందడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం