Wonder Woman Review: వండ‌ర్ ఉమెన్ మూవీ రివ్యూ - సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్‌-wonder woman movie telugu review nithya menon parvathy thiruvothus heart touching movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Wonder Woman Movie Telugu Review Nithya Menon, Parvathy Thiruvothus Heart Touching Movie Review

Wonder Woman Review: వండ‌ర్ ఉమెన్ మూవీ రివ్యూ - సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 19, 2022 02:37 PM IST

Wonder Woman Review: నిత్యామీన‌న్, న‌దియా, పార్వ‌తి, ప‌ద్మ‌ప్రియ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా వండ‌ర్ ఉమెన్‌. అంజ‌లి మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా సోనిలివ్ ఓటీటీ ద్వారా డైరెక్ట్‌గా రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉందంటే...

వండ‌ర్ ఉమెన్‌
వండ‌ర్ ఉమెన్‌

Wonder Woman Review: బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం అంటే స్త్రీకి పున‌ర్జ‌న్మ‌లాంటిద‌ని చెబుతుంటారు. ప్ర‌పంచంలోనే అన్ని బంధాల కంటే గొప్ప‌దైన మాతృత్వ‌పు బంధంలోకి అడుగుపెట్టే ముందు మ‌హిళ‌ల్లో ఎన్నో సంశ‌యాలు, భ‌యాలు ఉంటాయి. ముద్దుల చిన్నారిని ప్ర‌పంచంలోకి ఆహ్వానించే ముందు మ‌హిళ ప‌డే సంఘ‌ర్ష‌ణ‌కు దృశ్య‌రూపంగా వండ‌ర్ ఉమెన్ సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కురాలు అంజ‌లి మీన‌న్‌ (Anjali menon). నిత్యామీన‌న్‌ (Nitya menon), పార్వ‌తి (Parvathy), న‌దియా (Nadiya), ప‌ద్మ‌ప్రియ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఇటీవ‌ల సోని లివ్‌లో (Sonyliv) రిలీజైంది. థియేట‌ర్ల‌కు స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని ఎంత వ‌ర‌కు మెప్పించిందో చూద్ధాం...

Wonder Woman story -ఆరుగురు మ‌హిళ‌ల క‌థ‌

సుమ‌న పేరుతో ఓ పేరెంట‌ల్ కేర్ సెంట‌ర్‌ను నిర్వ‌హిస్తుంటుంది నందిత‌(న‌దియా). ఆరు నెల‌ల ప్రెగ్నెన్సీ దాటిన మ‌హిళ‌లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌తో పాటు బిడ్డ సంర‌క్ష‌ణ‌కు సంబంధించిన విష‌యాల్లో శిక్ష‌ణ ఇస్తోంటుంది నందిత‌. ఆ పేరెంట‌ల్ కేర్ సెంట‌ర్‌లో జాయిన్ నోరా జెసెఫ్ (నిత్యామీన‌న్‌), కృష్ణ‌వేణి బాల‌సుంద‌రం (ప‌ద్మ‌ప్రియ‌), మిని (పార్వ‌తి), సారా (స‌య‌నోరా), గ్రెసీ (అర్చ‌న ప‌ద్మిని), జ‌య (అమృత సుభాష్‌) అనే ఆరుగురు మ‌హిళ‌ల క‌థ ఇది.

భిన్న నేప‌థ్యాలు క‌లిగిన వారి జీవితాల్లో ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి? ఆ స‌మ‌స్య‌ల్ని ఎదుర్కోవ‌డంలో ఒక‌రికొక‌రు ఎలా అండ‌గా నిలిచారు? కొద్ది రోజుల ప‌రిచ‌యం లోనే వారి మ‌ధ్య అనుబంధం ఏ విధంగా బ‌ల‌ప‌డింది? అమ్మత‌నంలోని గొప్ప‌త‌నాన్ని వారు తెలుసుకున్నారా లేదా అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా…

వండ‌ర్ ఉమెన్ సినిమాను ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కురాలు అంజ‌లీ మీన‌న్ తెర‌కెక్కించారు. ప్ర‌స‌వ వేద‌న‌కు ముందు మ‌హిళ‌ల‌కు ఎదుర్కొనే సంఘ‌ర్ష‌ణ‌ను మ‌న‌సుల్ని క‌దిలించేలా ఇందులో చూపించారు. అరుగురు మ‌హిళ‌ల క‌థ ఇది. వారి స‌మ‌స్య‌ల్ని అంద‌రికి క‌నెక్ట్ అయ్యేలా క‌న్వీన్సింగ్‌గా చెప్ప‌డంలో ద‌ర్శ‌కురాలు చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు.

ఆరు స్టోరీస్…

నోరా జోసెఫ్ ఓ ఆర్కిటెక్చ‌ర్‌. ప్రెగ్నెన్సీ కార‌ణంగా భ‌ర్త ప్రేమ‌తో పాటు త‌న ల‌క్ష్యానికి దూర‌మ‌వుతున్నాన‌నే భ‌యంతో ఉంటుంది. కృష్ణ‌వేణి బాల‌సుంద‌రం లా చ‌దువుతుంది. అత్తింటివారి క‌ట్టుబాట్లు, ఆచారాల వ‌ల్ల ప్రాక్టీస్ మాత్రం చేయ‌దు. తాను ఏ ప‌నిచేయాల‌న్నా అత్త అనుమ‌తి తీసుకోవాల్సిందే.

సారా ఓ సింగ‌ర్‌. లివింగ్ రిలేష‌న్‌షిప్‌లో ఉంటుంది. బాయ్‌ఫ్రెండ్ త‌న ప‌ట్ల చూపించే అతిప్రేమ‌ను ఇబ్బందిగా ఫీల‌వుతుంది. మిని ఒంట‌రి మ‌హిళ‌. భ‌ర్త నుంచి విడాకులు తీసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంటుంది. ఎవ‌రితో క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌దు. జ‌య మూడు సార్లు ప్రెగ్నెన్సీ విఫ‌ల‌మ‌వుతుంది. నాలుగోసారి అమ్మ‌త‌నాన్ని ఆస్వాదించేందుకు ఎదురుచూస్తుంటుంది. నందిత పేరెంట‌ల్ సెంట‌ర్‌లోనే ప‌నిచేస్తోంటుంది గ్రేసీ.

సింపుల్ ఈష్యూస్‌...

ఈ అరుగురు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు చాలా సింపుల్‌గా ఉంటాయి. ప్ర‌తి ఇంట్లోనే మ‌హిళ‌ల‌కు ఎదుర‌య్యే కామ‌న్ ఇష్యూస్‌ను తీసుకొని ద‌ర్శ‌కురాలు ఈ క‌థ‌ను రాసుకున్నారు. ఎంతో ప్ర‌తిభ ఉండి కూడా త‌న పిల్ల‌ల కోసం ఇంటికే ప‌రిమితం కావ‌డానికి సిద్ధ‌ప‌డే మ‌హిళ‌ల త్యాగాల్ని, పిల్ల‌ల పెంప‌కంలో త‌ల్లితో పాటు తండ్రి బాధ్య‌త‌ల్ని...ఒక్కో పాయింట్‌ను సున్నితంగా డీల్ చేశారు. పిల్ల‌ల్ని ప్ర‌తి త‌ల్లి స‌మానంగానే పెంచుతుంటుంది. ఈ స‌మాన‌త్వ భావ‌న బ‌ల ప‌డాలంటే మ‌న‌సులో పాతుకుపోయిన కుల‌, మ‌త జాతి వివ‌క్ష‌ను విడ‌నాడాల‌ని చూపించారు. ఈ వివ‌క్ష‌ను పార‌ద్రోలే శ‌క్తి అమ్మ‌కే ఉంద‌ని చూపించారు.

ప్ర‌తి పాత్ర హైలైట్‌...

సినిమా మొత్తం ఏడు పాత్ర‌ల చుట్టూనే ఎక్కువ‌గా తిరుగుతుంది. ఒక‌రు ఎక్కువ మ‌రొక‌రు త‌క్కువ అని కాకుండా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ క్యారెక్ట‌ర్స్‌కు వంద శాతం న్యాయం చేశారు. నోరా జోసెఫ్ పాత్ర‌లో నిత్యామీన‌న్ డైలాగ్స్ కంటే త‌న ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఆక‌ట్టుకుంది. ఇత‌రుల‌తో క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఒంట‌రి మ‌హిళ‌గా పార్వ‌తి యాక్టింగ్ బాగుంది. ప‌ద్మ‌ప్రియ‌, స‌యానోరా, అర్చ‌న సుభాష్‌, అమృత స‌హ‌జ న‌ట‌న‌తో మెప్పించారు. పేరెంట‌ల్ కేర్ సెంట‌ర్ నిర్వ‌హ‌కురాలిగా న‌దియా ఎమోష‌న‌ల్ పాత్ర‌లో జీవించింది. నిత్య‌జీవితంలో మ‌న చూసే వ్య‌క్తుల‌ను పోలి ప్ర‌తి పాత్ర సాగుతుంది.

Wonder Woman Review- బ్యూటీఫుల్ ఫిల్మ్‌

వండ‌ర్ ఉమెన్ బ్యూటీఫుల్ ఎమోష‌న‌ల్ సినిమా. మాతృత్వ‌పు బంధంలోకి అడుగుపెట్ట‌బోతున్న ప్ర‌తి మ‌హిళ క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది. క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో చూస్తే మాత్రం అంత‌గా న‌చ్చ‌క‌పోవ‌చ్చు.

IPL_Entry_Point