Waltair Veerayya vs Veera Simha Reddy: వాల్తేర్ వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి - రన్ టైమ్ ఏది ఎక్కువంటే
Waltair Veerayya vs Veera Simha Reddy: చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాల రన్‌టైమ్ ఎంతంటే...
Waltair Veerayya vs Veera Simha Reddy: ఈ సారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ పోటీపడబోతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ వీరసింహారెడ్డి జనవరి 12న రిలీజ్ కానుండగా, చిరంజీవి వాల్తేర్ వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాల రన్‌టైమ్ తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీరసింహారెడ్డి రన్‌టైమ్ 2.43 నిమిషాలుగా ఉండగా వాల్తేర్ వీరయ్య మాత్రం 2.33 నిమిషాల రన్‌టైమ్‌తో రూపొందినట్లు తెలిసింది.
చిరంజీవి వాల్తేర్ వీరయ్య కంటే బాలకృష్ణ వీరసింహారెడ్డి పది నిమిషాల లెంగ్త్ ఎక్కువే ఉండటం గమనార్హం. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వీరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు.
జాలర్ల బ్యాక్‌డ్రాప్‌లో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వాల్తేర్ వీరయ్య సినిమా రూపొందుతోంది. రవితేజ మరో హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ రెండు సినిమాల్లో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.
మైనస్ ఎనిమిది డిగ్రీల టెంపరేచర్‌లో వాల్తేర్ వీరయ్య షూటింగ్
ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య షూటింగ్ ఫ్రాన్స్‌లో జరుగుతోంది. చిరంజీవి, శృతిహాసన్‌లో శ్రీదేవి అనే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
పూర్తిగా మంచుతో నిండిన ప్రదేశంలో మైనస్ ఎనిమిది డిగ్రీల టెంపరేచర్‌లో షూటింగ్ చేస్తోన్నట్లు చిరంజీవి తెలిపారు. శృతిహాసన్‌తో కలిసి దిగిన ఓ రొమాంటిక్ స్టిల్‌ను అభిమానులతో పంచుకున్నాడు.