Vinaro Bhagyamu Vishnu Katha Review: విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ మూవీ రివ్యూ - కిర‌ణ్ అబ్బ‌వ‌రం సినిమా ఎలా ఉందంటే-vinaro bhagyamu vishnu katha movie review kiran abbavaram romantic drama movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vinaro Bhagyamu Vishnu Katha Movie Review Kiran Abbavaram Romantic Drama Movie Review

Vinaro Bhagyamu Vishnu Katha Review: విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ మూవీ రివ్యూ - కిర‌ణ్ అబ్బ‌వ‌రం సినిమా ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Feb 18, 2023 09:40 AM IST

Vinaro Bhagyamu Vishnu Katha Review: కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన తాజా చిత్రం విన‌రో భాగ్య‌ము విష్ణు. బ‌న్నీ వాస్ నిర్మించిన ఈ సినిమాకు ముర‌ళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిన్న సినిమా ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా? లేదా?

కిర‌ణ్ అబ్బ‌వ‌రం
కిర‌ణ్ అబ్బ‌వ‌రం

Vinaro Bhagyamu Vishnu Katha Review: స‌హ‌జ‌త్వంతో కూడిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల్ని ఎంచుకుంటూ యంగ్ హీరోల్లో వైవిధ్య‌త‌ను చాటుకుంటున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం(Kiran Abbavaram). అత‌డు హీరోగా న‌టించిన తాజా చిత్రం విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌. ముర‌ళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌కుడు. కాశ్మీర ప‌ర‌దేశి హీరోయిన్‌గా న‌టించింది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాస్ విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ సినిమాను నిర్మించారు. టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ సినిమా చిన్న సినిమా ఎలా ఉందంటే...

విష్ణు క‌థ‌....

విష్ణు ఓ లైబ్రేరియ‌న్ (కిర‌ణ్ అబ్బ‌వ‌రం). ఎదుటివాడు బాగుంటే మ‌న‌కు బాగున్న‌ట్లే అని తాత చెప్పిన సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటాడు. త‌న‌కు ప‌రిచ‌యం ఉన్నా లేక‌పోయినా క‌ష్టాల్లో ఉన్న వారంద‌రికి సాయ‌ప‌డుతుంటాడు. ఫోన్ నెంబ‌ర్ నైబ‌రింగ్ ద్వారా యూట్యూబ‌ర్ ద‌ర్శ‌న (కాశ్మీర ప‌ర‌దేశి) అత‌డికి ప‌రిచ‌యం అవుతోంది. తొలిచూపులోనే విష్ణు ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు.

ద‌ర్శ‌న కూడా అత‌డిని ఇష్ట‌ప‌డుతుంది. కానీ ఆ ప్రేమ‌ను డైరెక్ట్‌గా చెప్ప‌కుండా పెట్ క్లినిక్ నిర్వ‌హించే శ‌ర్మ (ముర‌ళీ శ‌ర్మ‌)తో క్లోజ్‌గా ఉంటూ విష్ణును ఆట‌ప‌ట్టిస్తుంది. ఫేమ‌స్ అవ్వాల‌నే ఆలోచ‌న‌తో ద‌ర్శ‌న చేసిన ఓ ఫ్రాంక్ వీడియో వల్ల శ‌ర్మ నిజంగానే చ‌నిపోతాడు. ఆ హ‌త్య‌నేరంలో ద‌ర్శ‌న‌జైలుకు వెళుతుంది. ప‌క్కా ప్లాన్‌తో ద‌ర్శ‌న‌ను ఆ మ‌ర్డ‌ర్ కేసులో ఎవ‌రో ఇరికించార‌ని విష్ణుకు అర్థం అవుతుంది.

ద‌ర్శ‌న‌ను జైలు నుంచి విడిపించ‌డానికి విష్ణు ఏం చేశాడు? శ‌ర్మ‌ను హ‌త్య చేసింది ఎవ‌రు? నిజంగానే శ‌ర్మ హ‌త్య‌కు గుర‌య్యాడా? చ‌నిపోయిన‌ట్లుగా నాట‌కం ఆడాడా? ఎన్ఐఏ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్ట్ రాజ‌న్‌తో విష్ణుకు ఉన్న సంబంధం ఏమిట‌న్న‌దే(Vinaro Bhagyamu Vishnu Katha Review)ఈ సినిమా క‌థ‌.

ఆల్ జోన‌ర్స్ మిక్స్‌డ్‌...

త‌న చుట్టుప‌క్క‌ల వాళ్లంద‌రూ బాగుండాల‌ని కోరుకునే మ‌న‌స్త‌త్వ‌మున్న ఓ యువ‌కుడి క‌థ ఇది. ఈ సింపుల్‌ పాయింట్‌కు ఫోన్ నంబ‌ర్ నైబ‌ర్ అనే కాన్సెప్ట్‌ను జోడించి కొత్త‌ద‌నం తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు. మ‌న ఫోన్ నంబ‌ర్‌కు ముందు నంబ‌ర్‌, వెనుక నంబ‌ర్ ఉండేవాళ్లు సెల‌బ్రిటీలు కావచ్చు అంటూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ క‌థ‌ను(Vinaro Bhagyamu Vishnu Katha Review) అల్లుకున్నారు. ఈ పాయింట్‌ చుట్టూ ఓ ల‌వ్ స్టోరీతో కామెడీ, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అన్ని జోన‌ర్స్‌ను మిక్స్ చేస్తూ విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ సినిమాను తెర‌కెక్కించాడు. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో పాటు చిన్న సందేశాన్నిఫినిషింగ్ ట‌చ్‌గా ఇచ్చాడు.

విరామం ట్విస్ట్ హైలైట్‌...

విష్ణు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఫోన్ నంబ‌ర్ నైబర్ ద్వారా ప‌రిచ‌య‌మైన ద‌ర్శ‌న‌తో విష్ణు ప్రేమ‌లో ప‌డ‌టం, యూట్యూబ్ లో ఫేమ‌స్ అవ్వాల‌ని క‌శ్మీరా ప‌ర‌దేశి, ముర‌ళీ శ‌ర్మ హిట్స్ సాంగ్స్ డ్యాన్సులు చేయ‌డం లాంటి కామెడీ సీన్స్‌తో ఫ‌స్ట్ హాఫ్‌ను ఎంట‌ర్‌టైనింగ్‌గా న‌డిపించారు డైరెక్ట‌ర్‌. శ‌ర్మ‌ను ద‌ర్శ‌న హ‌త్య చేసే సీన్‌తో విరామం ముందు ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ద‌ర్శ‌న‌ను ఆ మ‌ర్డ‌ర్ కేసులో నేరంలో ఇరికించిన వారి కోసం విష్ణు సాగించే అన్వేష‌ణ చుట్టూ ద్వితీయార్థం సాగుతుంది. ఓ టెర్ర‌రిస్ట్‌తో విష్ణు త‌న క‌థంతా చెప్పిన‌ట్లుగా చూపిస్తూ ప్యార‌లాల్‌గా మ‌రో స్టోరీని ర‌న్ చేస్తూ చివ‌ర‌కు రెండింటిని లింక్ చేయ‌డం బాగుంది.

థ్రిల్ మిస్స‌యింది...

ఫోన్ నంబ‌ర్ నైబ‌రింగ్ అనే పాయింట్ త‌ప్పితే సినిమాలో మిగిలిన క‌థ మొత్తం రొటీన్‌గా సాగుతుంది. ఫ‌స్ట్ హాఫ్ క‌థ అనేది లేకుండా కేవ‌లం కామెడీతో మ్యానేజ్ చేశాడు డైరెక్ట‌ర్‌. విరామం ముందు వ‌చ్చే ట్విస్ట్ బాగున్నా ఆ మ‌లుపు రివీల్‌ అయ్యే తీరు,హీరో ఇన్వెస్టిగేష‌న్‌లో థ్రిల్ మిస్స‌య్యాయి.

నాచుర‌ల్ యాక్టింగ్‌...

సాటి వారికి సాయ‌ప‌డే యువ‌కుడిగా నాచుర‌ల్ యాక్టింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. గ‌త సినిమాల‌తో పోలిస్తే కామెడీ టైమింగ్ విష‌యంలో కొంత మెరుగ‌య్యాడు. మాస్ హీరోగా పేరుతెచ్చుకోవాల‌నే త‌ప‌న‌ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో క‌నిపించింది. కాశ్మీర ప‌ర‌దేశీ యాక్టింగ్ ఓకే. ముర‌ళీ శ‌ర్మ కామెడీ కొన్ని చోట్ల ప‌ర‌వాలేదు. ఈ మూడు పాత్ర‌లు త‌ప్ప మిగిలిన క్యారెక్ట‌ర్స్‌కు ఇంపార్టెన్స్ లేదు. చైత‌న్య భ‌ర‌ద్వాజ్ పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు బాగుంది. సినిమాలో ప్ర‌తి క్యారెక్ట‌ర్ చిత్తూరు యాస‌లో డైలాగ్స్ చెప్ప‌డం బాగుంది.

Vinaro Bhagyamu Vishnu Katha Review- టైమ్‌పాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌...

విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ అయినా కామెడీ ప‌రంగా మాత్రం టైమ్‌పాస్ చేస్తుంది.

రేటింగ్‌: 3/5

IPL_Entry_Point