Vijay Rashmika in Dubai: దుబాయ్‌లో లవ్ బర్డ్స్ విజయ్, రష్మిక.. ఫొటో వైరల్-vijay rashmika in dubai as photo of them gone viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Rashmika In Dubai As Photo Of Them Gone Viral

Vijay Rashmika in Dubai: దుబాయ్‌లో లవ్ బర్డ్స్ విజయ్, రష్మిక.. ఫొటో వైరల్

Hari Prasad S HT Telugu
Feb 01, 2023 03:01 PM IST

Vijay Rashmika in Dubai: దుబాయ్‌లో లవ్ బర్డ్స్ విజయ్, రష్మిక ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లిన విజయ్ దేవరకొండను రష్మిక మందన్నా కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

దుబాయ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా
దుబాయ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా

Vijay Rashmika in Dubai: టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా డేటింగ్ లో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలుసు కదా. ఈ ఇద్దరూ గతంలో మాల్దీవ్స్ కు కూడా కలిసి వెళ్లినట్లు తేలింది. దానికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడీ ప్రేమ జంట దుబాయ్ లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్లు సమాచారం.

తాజాగా ఓ అభిమాని ట్విటర్ ద్వారా బయటపెట్టిన ఫొటోలు ఇది నిజమేనని చెబుతున్నాయి. నిజానికి విజయ్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు. తన తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ వీధుల్లో, ఎడారిలో కూడా ఫొటోలకు పోజులిచ్చాడు. అయితే ఈ ఫొటోలతోపాటు మరో ఫొటో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడా ఫొటోనే విజయ్, రష్మిక లవ్ బర్డ్సే అని కన్ఫమ్ చేసేలా ఉన్నాయి.

గతంలో మాల్దీవ్స్ టూర్ కు వెళ్లినా అక్కడ ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఫొటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. అయితే ఇప్పుడు దుబాయ్ లో మాత్రం విజయ్, రష్మిక కలిసి ఉన్న ఫొటో అని చెబుతూ ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. హోటల్ బాల్కనీలో ఈ ఇద్దరూ నిలబడినప్పుడు దూరం నుంచి తీసిన ఫొటోగా కనిపిస్తోంది. అయితే ఇది ఎంత వరకూ నిజం అన్నది తెలియడం లేదు.

కానీ తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నప్పటి డ్రెస్ లోనే విజయ్ కనిపించాడు. అతని ముందు రష్మిక నవ్వుతూ ఉన్నట్లు ఫొటోలో కనిపిస్తోంది. ఇప్పటి వరకూ వీళ్లు తాము డేటింగ్ లో ఉన్నట్లు మాత్రం చెప్పలేదు. అయితే తాను విజయ్ కు చాలా క్లోజ్ అన్నట్లు మాత్రం గతంలో రష్మిక చెప్పింది. న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తమ గురించి ఏం చర్చ జరుగుతోందో తెలుసని, కొన్ని వీడియోలు చూస్తే క్యూట్ గా అనిపించిందని తెలిపింది.

ఇక వీళ్ల సినిమాల విషయానికి వస్తే రష్మిక ఈ మధ్యే నటించిన తన రెండో బాలీవుడ్ మూవీ మిషన్ మజ్నూ నేరుగా ఓటీటీలోకి వచ్చింది. అయితే ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలే ఎక్కువగా వచ్చాయి. జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. మరోవైపు విజయ్ దేవరకొండ..సమంతతో కలిసి ఖుషీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

IPL_Entry_Point

సంబంధిత కథనం