vijay devarakonda - mike tyson: మైక్ టైసన్ బూతులు తిట్టాడు - విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-vijay deverakonda says mike tyson abused him on liger sets ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Devarakonda - Mike Tyson: మైక్ టైసన్ బూతులు తిట్టాడు - విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

vijay devarakonda - mike tyson: మైక్ టైసన్ బూతులు తిట్టాడు - విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

HT Telugu Desk HT Telugu
Aug 26, 2022 01:40 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలకమైన అతిథి పాత్రలో నటించాడు. మైక్ టైసన్ తో షూటింగ్ షూటింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

విజయ్ దేవరకొండ, మైక్ టైస‌న్
విజయ్ దేవరకొండ, మైక్ టైస‌న్ (Twitter)

లైగ‌ర్ షూటింగ్ స‌మ‌యంలో మైక్ టైస‌న్ త‌న‌ను తిట్టాడ‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నాడు. అవ‌న్నీ ప్రేమ‌తో అన్న మాట‌లేన‌ని తెలిపాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లైగ‌ర్ సినిమా గురువారం రోజు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకు తొలి ఆట నుండే నెగెటివ్ టాక్ వ‌చ్చింది. అయినా మొద‌టిరోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ముప్పైమూడు కోట్ల కలెక్షన్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ గెస్ట్ క్యారెక్టర్ లో నటించాడు.

మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు స్ఫూర్తినిచ్చే వ్య‌క్తిగా క‌నిపించాడు. క్లైమాక్స్ లో విజ‌య్ దేవ‌ర‌కొండతో క‌లిసి యాక్ష‌న్ సీక్వెన్స్ లో మైక్ టైస‌న్ నటించాడు. మైక్ టైస‌న్ తో షూటింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో విజ‌య్ దేవ‌ర‌కొండ వెల్ల‌డించాడు. షూటింగ్ స‌మ‌యంలో మైక్ టైస‌న్ చాలా సంద‌ర్భాల్లో త‌న‌ను తిట్టాడ‌ని అన్నాడు. ఆ బూతు మాట‌ల్ని రిపీట్ చేయ‌ద‌ల్చుకోలేదని చెప్పాడు. అయితే అవ‌న్నీ త‌న‌పై ప్రేమ‌తో మైక్ టైస‌న్ చేసిన కామెంట్స్ కావ‌డంతో తాను స‌ర‌దాగానే తీసుకున్న‌ట్లుగా విజ‌య్ తెలిపాడు.

ఇండియా అంటే టైసన్ కు గౌరవభావముందని, ఇక్కడి ఫుడ్, మ్యూజిక్ ను అతడు చాలా ఇష్టపడతాడని విజయ్ తెలిపాడు. గతంలో టైసన్ ఇండియా వచ్చిన సందర్భంలో అతడిని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు ఎయిర్ పోర్ట్, , హోటల్ వద్దకు గుంపులుగా వచ్చారని, , వారందనిని చూసి భయపడిన సంగతిని షూటింగ్ సమయంలో టైసన్ తనతో పంచుకున్నారని విజయ్ దేవరకొండ చెప్పాడు. మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ పై కనిపించిన తొలి సినిమా ఇదే.

IPL_Entry_Point