Vijay Deverakonda celebrates bodyguard birthday: బాడీగార్డ్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన రౌడీ హీరో విజయ్‌-vijay deverakonda celebrates bodyguard birthday photos gone viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Deverakonda Celebrates Bodyguard Birthday Photos Gone Viral

Vijay Deverakonda celebrates bodyguard birthday: బాడీగార్డ్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన రౌడీ హీరో విజయ్‌

HT Telugu Desk HT Telugu
Nov 28, 2022 08:27 PM IST

Vijay Deverakonda celebrates bodyguard birthday: బాడీగార్డ్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేస్తున్న రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అతని సింప్లిసిటీకి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

తన బాడీగార్డ్ బర్త్ డే వేడుకల్లో విజయ్ దేవరకొండ
తన బాడీగార్డ్ బర్త్ డే వేడుకల్లో విజయ్ దేవరకొండ

Vijay Deverakonda celebrates bodyguard birthday: టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండకు రౌడీ హీరోగా పేరుంది. సిల్వర్‌ స్క్రీన్‌పై అతడు పోషించిన క్యారెక్టర్లు అలాంటివి. ఈ మధ్యే లైగర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. తాజాగా తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఆదివారం (నవంబర్‌ 27) తన పర్సనల్ బాడీగార్డ్‌ బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్‌ చేశాడు.

అతని కోసం కేక్‌ తెప్పించాడు. సెలబ్రేషన్స్‌లో తానూ ఉండి అతనికి బెస్ట్‌ విషెస్‌ చెప్పాడు. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. తమ రౌడీ హీరో మనసు బంగారం అంటూ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. విజయ్‌ బాడీగార్డ్‌ తన తల్లితో కలిసి కేక్‌ కట్‌ చేయడం ఈ ఫొటోల్లో చూడొచ్చు.

ఆ పక్కనే విజయ్‌ కూడా ఉన్నాడు. "స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. తన బాడీగార్డ్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేస్తున్నాడు" అంటూ ఓ అభిమాని ట్విటర్‌లో ఈ ఫోటోలు షేర్‌ చేశాడు. గడిచిన వీకెండ్‌లో విజయ్‌ దేవరకొండ ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే ఈ ఫొటోలు చూసి అతడు ప్రభాస్‌ సలార్‌ మూవీలో ఉన్నాడన్న వార్తలు కూడా వచ్చాయి.

ప్రస్తుతం అతడు ఖుషీ మూవీ షూటింగ్‌లో ఉన్నాడు. సమంతతో కలిసి ఇందులో విజయ్ నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. మరో 4, 5 వారాల షూటింగ్‌ మిగిలి ఉంది. గతంలో మహానటిలో కలిసి నటించిన ఈ ఇద్దరూ ఇప్పుడు మరోసారి సిల్వర్‌ స్క్రీన్‌పై మ్యాజిక్‌ చేయనున్నారు. ఈ మధ్యే తన కాలేజీ రోజుల్లో సమంతను చూడగానే మనసు పారేసుకున్నట్లు విజయ్‌ చెప్పిన విషయం తెలిసిందే.

ఇక ఈ ఖుషీ మూవీ షూటింగ్‌లో విజయ్‌, సమంత గాయపడినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ మూవీ మేకర్స్‌ మాత్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. 30 రోజుల పాటు కశ్మీర్‌లో షూటింగ్‌ జరుపుకొని, సేఫ్‌గా హైదరాబాద్‌ వచ్చామని, ఇలాంటి వార్తలను నమ్మొద్దని ఓ ప్రకటనలో చెప్పారు.

IPL_Entry_Point