Urvashi Rautela Remuneration: పేమెంట్ పెంచేసిన బాలీవుడ్ బ్యూటీ.. ఒక్క సాంగ్ కోసం కోట్లలో డిమాండ్..!
Urvashi Rautela Remuneration: బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌటేలా తన పారితోషికాన్ని గణనీయంగా పెంచేసింది. ఒక్క సాంగ్ కోసం ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేసింది. బోయపాటి-రామ్ కాంబోలో తెరెకెక్కుతున్న మూవీ కోసం ఇంతటి భారీ మొత్తాన్ని అడిగిందని టాక్.
Urvashi Rautela Remuneration: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా చిన్నగా టాలీవుడ్‌లో పాగా వేయాలని చూస్తోంది. హీరోయిన్‌గా కాకపోయినా ప్రత్యేక గీతాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకుంటోంది. అందుకే అందివచ్చిన అవకాశాలను సద్వినయోగం చేసుకుంటూ దూసుకెళ్తోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, ఏజెంట్ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన పాపులారిటీని పెంచుకుంటోంది. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య సినిమాలో ఆమె చేసి వేర్ ఈజ్ ది పార్టీ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
ఆమె డ్యాన్సింగ్ స్కిల్స్, పర్ఫార్మెన్స్ చూసి అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన ఏజెంట్ చిత్రంలో కూడా అవకాశమొచ్చింది. తన గ్లామర్‌తో పాటకు మంచి ఊపు తెచ్చింది. అయితే ఈ మూవీపై పెద్దగా విజయాన్ని అందుకోనప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మంచి మార్కులు పడ్డాయి. క్రమంగా తెలుగులో ఫాలోయింగ్ ఏర్పడటంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతల దృష్టి ఊర్వశీపై పడింది. తాజాగా బోయపాటి శ్రీను.. రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో కూడా ఊర్వశి ప్రత్యేక గీతంలోనే చేస్తోందని సమాచారం. అయితే ఈ సాంగ్ కోసం ఆమె రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తోందట. సినీ వర్గాల నివేదికల ప్రకారం బోయపాటి-రామ్ మూవీలో ఈ ఐటెం సాంగ్ కోసం ఈ బ్యూటీ ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్. అయితే ఆమె పాపులారిటీని చూసి మేకర్స్ కూడా అంత మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. ఈ వార్త బయటకు రావడంతో ఊర్వశి రెమ్యూనరేషన్ చూసి షాక్ అవుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్య పాట కోసం ఊర్వశి రూ.2 కోట్లు తీసుకోగా.. ఇప్పుడు రామ్ చిత్రం కోసం ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేయడం ఫిల్మ్ పండితులను నోరెళ్లబెట్టేలా చేస్తోంది. అయితే ఆమె మార్కెట్, ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకని చూస్తే ఆ రెమ్యూనరేషనే వర్తబులేనని మేకర్స్ భావిస్తున్నారట.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్‌గా చేస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సంతోష్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అక్టోబరు 20న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.