Suriya 42 Update: సూర్య 42 నుంచి అదిరిపోయే అప్డేట్.. పీరియాడికల్ ఫాంటసీగా రానున్న చిత్రం-suriya 42 to be a fantasy dram movie with 1000 year old back story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Suriya 42 To Be A Fantasy Dram Movie With 1000 Year Old Back Story

Suriya 42 Update: సూర్య 42 నుంచి అదిరిపోయే అప్డేట్.. పీరియాడికల్ ఫాంటసీగా రానున్న చిత్రం

Maragani Govardhan HT Telugu
Nov 25, 2022 08:33 PM IST

Suriya 42 Update: కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న తాజా చిత్రాన్ని శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా వెయ్యేళ్ల క్రితం నాటి స్టోరీగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

సూర్య 42
సూర్య 42

Suriya 42 Update: కోలీవుడ్ స్టార్ సూర్యకు తమిళంలో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటి నుంచో ఆయన సినిమాలు ఇక్కడ విడుదలవుతూ మంచి హిట్ అందుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఆయన ఈటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతేకాకుండా విక్రమ్ సినిమాలో రోలెక్స్‌గా ప్రేక్షకులను అలరించారు. ఇటీవలే సూర్య తన 42వ చిత్రాన్ని (Suriya 42) ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రానుందని తెలుస్తోంది.

ఈ విషయాన్ని సూర్య 42 చిత్రానికి ఎడిటర్‌గా పనిచేస్తోన్న నిషద్ యూసుఫ్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కనున్న ఫాంటసీగా రానుందని తెలిపారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో భాగంగా 35 రోజుల పాటు గోవాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయని సమాచారం. ఇందుకోసం 100 బౌన్సర్లతో చిత్రబృందం చిత్రీకరణ జరిపిందట.

ఈ సినిమా బ్యాక్ స్టోరీకి సంబంధించిన షూటింగ్‌ను శ్రీలంకలో జరపనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి 60 రోజుల షెడ్యూల్‌లో టీమ్ పాల్గొనుందట. పూర్తిగా అడవుల్లో ఈ షెడ్యూల్ చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. భారీ స్థాయి యాక్షన్, యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లోపు ఈ శ్రీలంక షెడ్యూల్ పూర్తవుతుందని చిత్రబృందం తెలిపింది. అనంతరం సూర్య తన తదుపరి సినిమాను మొదలుపెట్టనున్నారు.

ఈ సినిమాలో సూర్య.. అరథార్, వెంకటర్, మాందాకర్, ముక్తార్, పెరుమంతార్ అనే ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. బాలీవుడ్ నటి దిశా పటానీ హీరోయిన్‌గా చేస్తోందట. సూర్య సరసన ఆమె రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. 10 భాషల్లో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్