Surya Singam 4 Update: సింగం 4కు సూర్య గ్రీన్ సిగ్నల్ -కథ రెడీ చేస్తోన్న డైరెక్టర్ హరి
Suriya Singam 4 Update: రేసీ స్క్రీన్‌ప్లే, పవర్‌ఫుల్ యాక్షన్ అంశాలతో తెరకెక్కిన సింగం సిరీస్ సినిమాలు కోలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్ హిట్స్‌గా నిలిచాయి. ఈ సిరీస్‌కు కొనసాగింపుగా సింగం 4 రాబోతున్నట్లు తెలిసింది.
Suriya Singam 4 Update: సింగం సిరీస్ సినిమాలు కోలీవుడ్‌లో హీరోసూర్యను తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టాయి. అప్పటివరకు కెరీర్‌లో ఎక్కువగా క్లాస్ యాక్షన్ సినిమాల్లోనే కనిపించిన సూర్యలోని మాస్ యాంగిల్‌ను డిఫరెంట్‌గా ఈ సినిమాలో ప్రజెంట్ చేశారు దర్శకుడు హరి. ఇందులో దొరై సింగం అనే పోలీస్ ఆఫీసర్‌గా సూర్య యాక్టింగ్ డైలాగ్ డెలివరీ అభిమానులను ఆకట్టుకున్నాయి. రేసీ స్క్రీన్‌ప్లే, పవర్‌ఫుల్ యాక్షన్ అంశాలతో హరి ఈ సినిమాల్ని తెరకెక్కించారు.
ఇప్పటివరకు సింగం సిరీస్‌లో మూడు సినిమాలొచ్చాయి.ఈ సినిమాలన్నీ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. తాజాగా ఈ ఫ్రాంచైజ్‌లో నాలుగో సింగం రాబోతున్నట్లు తెలిసింది. సింగం ఫోర్ కోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో దర్శకుడు హరి బిజీగా ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్ డిస్కషన్స్ కోసం త్వరలోనే సూర్యను దర్శకుడు హరి కలవబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సింగం సిరీస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సింగం 4లో నటించడానికి సూర్య రెడీ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత ఈ సినిమాకు డేట్స్ కేటాయించాలనే ఆలోచనలో సూర్య ఉన్నట్లు సమాచారం. సింగం 4 సినిమా 2023 సెకండాఫ్‌లో సెట్స్‌పైకి రావచ్చునని చెబుతున్నారు.
ప్రస్తుతం బాలా దర్శకత్వం వనాంగాన్ తో పాటు సిరుత్తై శివతో పీరియాడికల్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాతే సింగం 4ను సెట్స్‌పైకి తీసుకురావాలనే అనుకుంటున్నట్లు చెబుతున్నారు. మరోవైపు హరి కూడా ఇటీవలే ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
కాగా ఈ సింగం సిరీస్ సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ అయ్యాయి. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ఈ రీమేక్‌లకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు.