Bhaag Saale first look: 'భాగ్ సాలే' అంటున్న కీరవాణి తనయుడు.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల -sri simha new movie bhaag saale first look poster released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhaag Saale First Look: 'భాగ్ సాలే' అంటున్న కీరవాణి తనయుడు.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Bhaag Saale first look: 'భాగ్ సాలే' అంటున్న కీరవాణి తనయుడు.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Maragani Govardhan HT Telugu
Oct 07, 2022 04:22 PM IST

Bhaag Saale First Look Poster: నేటి తరం ప్రేక్షకులని అలరించే సరికొత్త కథతో యువ హీరో శ్రీ సింహా ముందుకు రాబోతున్నాడు. అతడు నటించిన కొత్త చిత్రం 'భాగ్ సాలే'. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది.

భాగ్ సాలే ఫస్ట్ లుక్ పోస్టర్
భాగ్ సాలే ఫస్ట్ లుక్ పోస్టర్ (Twitter)

Sri Simha Bhaag Saale First Look Poster Release: కీరవాణి రెండో కుమారుడ శ్రీ సింహ.. మత్తువదలరా సినిమాతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది ఇప్పటికే దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాలో నటించి మెప్పించాడు. తాజాగా మరో కొత్త సినిమాతో సందడి చేయనున్నాడు. నేటి తరం ప్రేక్షకులని అలరించే సరికొత్త కథతో రాబోతున్నాడు. అదే భాగ్ సాలే. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు విడుదలయింది.

ప్రణీత్ సాయి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. సంగీతం కాల భైరవ అందిస్తుండగా, ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్ చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటూ విడుదలకి సిద్ధంగా ఉంది.

"టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ "ఈతరం ప్రేక్షకులని అలరించే కథతో థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న మా చిత్రం 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ప్రణీత్ సాయి దర్శకత్వంలో యువ హీరో శ్రీ సింహా, అర్జున్ పాత్రలో నటిస్తుండగా నేహా సొలంకి హీరోయిన్ గా నటిస్తుంది. జాన్ విజయ్, నందిని రాయ్ ప్రతినాయక పాత్రలు చేస్తున్నారు. ఏం చేసైనా అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్ చేస్తుంది. ఇందులో రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు నటిస్తున్నారు అని ఆయన అన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్