Pathaan 4th Day Box Office Collection : రూ.300 కోట్ల క్లబ్‌లో బాలీవుడ్ బాద్ షా 'పఠాన్' మూవీ-sharukh khan pathaan movie 4th day box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathaan 4th Day Box Office Collection : రూ.300 కోట్ల క్లబ్‌లో బాలీవుడ్ బాద్ షా 'పఠాన్' మూవీ

Pathaan 4th Day Box Office Collection : రూ.300 కోట్ల క్లబ్‌లో బాలీవుడ్ బాద్ షా 'పఠాన్' మూవీ

Anand Sai HT Telugu
Jan 29, 2023 10:04 AM IST

Pathaan Movie Collections : షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా వసూళ్ల సునామి సృష్టిస్తోంది. రికార్డులు బ్రేక్ చేస్తూ.. బాక్సాఫీసు బద్దలు కొడుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా వసూళ్లలో ఎక్కడా తగ్గలేదు.

షారుక్ ఖాన్, దీపికా పదుకోన్
షారుక్ ఖాన్, దీపికా పదుకోన్

షారుఖ్ ఖాన్(Sharukh Khan) నటించిన పఠాన్(Pathaan) బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తూనే ఉంది. అత్యంత వేగంగా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇండియాలో పఠాన్ 4వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ 55 కోట్లుగా ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ చిత్రం తొలిరోజు రూ. 57 కోట్లు, రెండో రోజు రూ.70.50 కోట్లు, మూడో రోజు రూ.39.25 కోట్లు వసూళ్లు చేసింది. జనవరి 26 సెలవుదినం కావడంతో భారీగా వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత మూడో రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.

పఠాన్ 4వ రోజు బాక్సాఫీస్ వసూళ్లను వివరిస్తూ, బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా పఠాన్ మూడు రోజుల్లో రూ.313 కోట్లు(గ్రాస్). 300 కోట్ల మార్కును అధిగమించిన వేగవంతమైన హిందీ చిత్రంగా నిలిచింది(ఓవర్సిస్ ప్లస్ ఇండియా గ్రాస్).

విడుదలైన మొదటి మూడు రోజుల కలెక్షన్ల పరంగా పఠాన్ ఇప్పటికే కేజీఎఫ్ 2, బాహుబలి 2 బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో రూ. 49 కోట్లు కంటే ఎక్కువ వసూళ్లు అని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా దాని మొత్తం రూ. 420 కోట్లను దాటవచ్చు.

జనవరి 25న థియేటర్లలో విడుదలైన పఠాన్ నాలుగేళ్ల తర్వాత వచ్చిన షారుక్ సినిమా. ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్‌తో ప్రారంభమైంది. గత బాలీవుడ్ చిత్రాల అన్ని మార్కులను బద్దలు కొట్టింది. మూడు రోజుల్లో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలీవుడ్ చిత్రాల ఓపెనింగ్ వీకెండ్ రికార్డులను బద్దలు కొట్టింది.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం, దీపికా పదుకొణె(Deepika Padukone) కూడా నటించారు. యష్ రాజ్ ఫిలీంస్ ఈ సినిమాను నిర్మించింది. మెుదటి నుంచి ఈ సినిమా చుట్టూ వివాదాలు ఉన్నాయి. దీనిపై బాయ్ కాట్ ఉద్యమం కూడా నడిచింది. కానీ అందరి అంచనాలు మించి.. షారుఖ్ పఠాన్ దూసుకెళ్తోంది. బాలీవుడ్ రికార్డులను బద్దలు కొడుతోంది.

IPL_Entry_Point

టాపిక్