Dulquer Salmaan - Samantha Movie: దుల్క‌ర్ స‌ల్మాన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో స‌మంత హీరోయిన్‌-samantha to pair up with dulquer salmaan for malayalam movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Samantha To Pair Up With Dulquer Salmaan For Malayalam Movie

Dulquer Salmaan - Samantha Movie: దుల్క‌ర్ స‌ల్మాన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో స‌మంత హీరోయిన్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 27, 2022 06:13 AM IST

Dulquer Salmaan - Samantha Movie: పాన్ ఇండియ‌న్ సినిమాలో హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ది స‌మంత‌. దుల్క‌ర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఏదంటే...

స‌మంత‌
స‌మంత‌ (Twitter)

Dulquer Salmaan - Samantha Movie: ఈ ఏడాది సీతారామంతో(Seetharamam) పాటు బాలీవుడ్ సినిమా చుప్‌తో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. పాన్ ఇండియ‌న్ స్థాయిలో హీరోగా చ‌క్క‌టి క్రేజ్‌ను సొంతం చేసుకున్న అత‌డితో సినిమాలు వివిధ భాష‌ల‌కు చెందిన అగ్ర ద‌ర్శ‌కులు ఆస‌క్తిని చూపుతున్నారు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ కింగ్ ఆఫ్ కోతా పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

కెరీర్‌లో తొలిసారి దుల్క‌ర్ పూర్తిస్థాయి మాస్ పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా ఇది. కింగ్ ఆఫ్ కోతా(King of Kotha) త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అని దుల్క‌ర్ ప‌లు మార్లు వెల్ల‌డించాడు. సోమ‌వారం నుంచి త‌మిళ‌నాడులోని క‌రైకుడిలో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. కాగా ఈ సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్‌కు జోడీగా స‌మంత హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

చాలా రోజుల క్రిత‌మే స‌మంత‌ను క‌లిసిన ద‌ర్శ‌కుడు క‌థ‌ను వినిపించిన‌ట్లు తెలిసింది. స‌మంత కూడా ఈ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్న‌ట్లు తెలిసింది. అత‌డితో పాటు శోభిత ధూలిపాళ్ల‌, మ‌నోజ్ బాజ్‌పాయ్ న‌టిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

పాన్ ఇండియ‌న్ స్థాయిలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత తెలుగులో యశోద, శాకుంతల తో పాటు విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తోంది. హిందీలో సిటాడెల్ సిరీస్‌లో న‌టిస్తోంది.

IPL_Entry_Point

టాపిక్