Prabhas Salaar Update: హైద‌రాబాద్‌లో స‌లార్ - పృథ్వీరాజ్‌తో యాక్ష‌న్‌కు ప్ర‌భాస్ రెడీ-salaar update prabhas salaar next schedule begins in hyderabad on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Salaar Update Prabhas Salaar Next Schedule Begins In Hyderabad On This Date

Prabhas Salaar Update: హైద‌రాబాద్‌లో స‌లార్ - పృథ్వీరాజ్‌తో యాక్ష‌న్‌కు ప్ర‌భాస్ రెడీ

Nelki Naresh Kumar HT Telugu
Jan 07, 2023 10:46 AM IST

Prabhas Salaar Update: స‌లార్ నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్‌ను ఆదివారం నుంచి ప్ర‌భాస్ మొద‌లుపెట్ట‌బోతున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఏ రోజు నుంచి మొద‌లుకానుందంటే...

ప్ర‌భాస్
ప్ర‌భాస్

Prabhas Salaar Update: ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స‌లార్ సినిమా తాజా షెడ్యూల్ హైద‌రాబాద్‌లో మొద‌లుకానుంది. ఆదివారం నుంచి ప్రారంభంకానున్న‌ ఈ షెడ్యూల్ దాదాపు ఇర‌వై రోజుల‌కుపైగా కొన‌సాగ‌నున్న‌ట్లు తెలిసింది. ఈ షెడ్యూల్‌లో ప్ర‌భాస్‌తో పాటు విల‌న్ పృథ్వీరాజ్ సుకుమారన్ లపై ముఖ్య‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ను తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది.

ఈ యాక్ష‌న్ ఎపిసోడ్స్ షూటింగ్ కోసం భారీ వ్య‌యంతో స్పెష‌ల్ సెట్స్‌ను సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. హైద‌రాబాద్ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోనున్న‌ట్లు చెబుతున్నారు. నెక్స్ట్ షెడ్యూల్‌ను ప‌ది రోజుల పాటు ఇట‌లీలో ప్లాన్ చేసిన‌ట్లు తెలిసింది.

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్నాడు. వ‌ర‌ద‌రాజా మొద‌లియార్ అనే విల‌న్‌గా ప్ర‌భాస్‌కు ధీటుగా పృథ్వీరాజ్ సుకుమార‌న్ క్యారెక్ట‌ర్‌ను ప్ర‌శాంత్ నీల్ డిజైన్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

స‌లార్ సినిమాను ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు గ‌తంలో ప్ర‌శాంత్ నీల్ ప్ర‌క‌టించాడు. కానీ ఆ డేట్‌కు సినిమా రావ‌డం అనుమాన‌మే అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌లార్ సినిమాలో ఆద్య అనే జ‌ర్న‌లిస్ట్‌గా శృతిహాస‌న్ న‌టిస్తోంది. జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో స‌లార్ సినిమాను రూపొందిస్తోంది. స‌లార్‌తో పాటుగా ప్ర‌స్తుతం ప్ర‌భాస్ మ‌రోమూడు సినిమాలు చేస్తున్నాడు. నాగ్ అశ్విన్‌తో చేస్తోన్న ప్రాజెక్ట్ కే సినిమా సూప‌ర్ హీరో క‌థాంశంతో రూపొంద‌నుంది.

ద‌ర్శ‌కుడు మారుతితో సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు ప్ర‌భాస్‌. అలాగే ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ సినిమా జూన్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది.

IPL_Entry_Point