NTR 30 Update: ఎన్టీఆర్‌ను ఢీ కొట్ట‌డానికి సైఫ్ అలీఖాన్ రెడీ- సెట్స్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ న‌టుడు-saif ali khan may enters ntr 30 movie shooting on today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr 30 Update: ఎన్టీఆర్‌ను ఢీ కొట్ట‌డానికి సైఫ్ అలీఖాన్ రెడీ- సెట్స్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ న‌టుడు

NTR 30 Update: ఎన్టీఆర్‌ను ఢీ కొట్ట‌డానికి సైఫ్ అలీఖాన్ రెడీ- సెట్స్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ న‌టుడు

Nelki Naresh Kumar HT Telugu
Apr 18, 2023 10:56 AM IST

NTR 30 Update: ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడు. మంగ‌ళ‌వారం ఈ సినిమా సెట్స్‌లో సైఫ్ అలీఖాన్ అడుగుపెట్టాడు.

కొర‌టాల శివ‌, సైఫ్ అలీఖాన్‌, ఎన్టీఆర్‌
కొర‌టాల శివ‌, సైఫ్ అలీఖాన్‌, ఎన్టీఆర్‌

NTR 30 Update: ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియ‌న్ మూవీలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఈ పుకార్ల‌ను నిజం చేస్తూ మంగ‌ళ‌వారం ఎన్టీఆర్ మూవీ సెట్స్‌లో సైఫ్ అలీఖాన్ అడుగుపెట్టాడు.

ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఎన్టీఆర్‌, కొర‌టాల శివ‌తో క‌లిసి సైఫ్ అలీఖాన్ దిగిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ సోమ‌వారం రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లైంది. ఈ షెడ్యూల్ కోసం ఇప్ప‌టికే జాన్వీ క‌పూర్ హైద‌రాబాద్ వ‌చ్చేసింది. తాజాగా మంగ‌ళ‌వారం సైఫ్ అలీఖాన్ మూవీ షూటింగ్‌లో భాగ‌మ‌య్యాడు. ఈ షెడ్యూల్‌లో హీరోహీరోయిన్లు ఎన్టీఆర్‌, జాన్వీక‌పూర్‌తో పాటు సైఫ్ అలీఖాన్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేందుకు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు తె లిసింది.

కోస్ట‌ల్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్ లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇందులో సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ కీల‌క పాత్ర‌ను పోషిస్తోన్నాడు. ఎన్టీఆర్ సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్‌తో క‌లిసి మిక్క‌లినేని సుధాక‌ర్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తోన్న 30వ సినిమా ఇది.

IPL_Entry_Point