Saakini Daakini Trailer: ఫన్నీగా, పవర్‌ఫుల్‌గా శాకిని డాకిని ట్రైలర్
Saakini Daakini Trailer: ఫన్నీగా, పవర్‌ఫుల్‌గా శాకిని డాకిని ట్రైలర్ వచ్చేసింది. ఈ టైటిల్ క్యారెక్టర్స్‌లో నివేదా థామస్, రెజీనా అదరగొట్టేశారు. ట్రైలర్‌తోనే మూవీ అంచనాలు పెంచేసింది.
Saakini Daakini Trailer: నివేదా థామస్, రెజీనా కసాండ్రా నటిస్తున్న శాకిని డాకిని ట్రైలర్ సోమవారం (సెప్టెంబర్ 12) రిలీజైంది. ఈ మూవీ సెప్టెంబర్ 16న రిలీజ్ కాబోతోంది. అయితే ట్రైలర్‌తోనే మూవీ అంచనాలు పెంచేసింది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్స్‌గా కనిపించనున్న నివేదా, రెజీనా.. మొదట్లో తమలో తాము పోట్లాడుకుంటూ, ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్స్‌తో ఎలా పోరాడారన్నదే అసలు స్టోరీ.
ట్రెండింగ్ వార్తలు
ట్రైలర్ మొదట్లోనే శాకిని డాకిని క్యారెక్టర్లను పరిచయం చేశారు. ఇక ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు టీజ్ చేసుకోవడం చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇందులో తెలంగాణ యాసలో నివేదా థామస్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఇద్దరి ఫన్నీ ఎపిసోడ్ నడుస్తుండగానే ట్రైలర్ సడెన్‌గా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడం, ఆమెను వెతుక్కుంటూ ఈ ఇద్దరూ వెళ్లడంలాంటి సీన్లు ట్రైలర్‌లో చూడొచ్చు.
సరదాగా సాగుతూనే ఓ మిస్టరీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌లాగా శాకిని డాకిని మూవీ ఉండబోతోందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ముఖ్యంగా నివేదా క్యారెక్టర్‌ను కాస్త పవర్‌ఫుల్‌గా చూపించారు. పైగా ఈ ఇద్దరూ చేసే స్టంట్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి ట్రైలర్ మాత్రం ఈ మూవీపై అంచనాలను భారీగా పెంచిందని చెప్పొచ్చు. ఈ మూవీని సురేశ్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఇంతకుముందే వచ్చిన టీజర్ మూవీలోని మెయిన్ క్యారెక్టర్లపైనే దృష్టి సారించగా.. ట్రైలర్ మాత్రం మూవీలోని మెయిన్ ప్లాట్‌పై ఆసక్తిరేపేలా సాగింది. శాకిని డాకినిగా నివేదా, రెజీనా హ్యూమర్‌ను పండిస్తూనే యాక్షన్ ఎపిసోడ్లలోనూ అదరగొట్టారు. ఓ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లాగా మూవీని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.