Bigg Boss 6 Telugu, Episode 41: బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా ఆర్జే సూర్య.. సిగ్గు పడుతూ బావకు ఓటేసిన ఇనాయా..!-rj surya is become new captain of bigg boss 6 sixth week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu, Episode 41: బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా ఆర్జే సూర్య.. సిగ్గు పడుతూ బావకు ఓటేసిన ఇనాయా..!

Bigg Boss 6 Telugu, Episode 41: బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా ఆర్జే సూర్య.. సిగ్గు పడుతూ బావకు ఓటేసిన ఇనాయా..!

Maragani Govardhan HT Telugu
Oct 15, 2022 06:53 AM IST

Bigg Boss 6 Telugu, Episode 41: గతవారం కెప్టెన్‌గా ఛాన్స్ మిస్ చేసుకున్న ఆర్జే సూర్య.. ఈ సారి కెప్టెన్‌గా నిలిచాడు. హౌస్ మేట్స్ సపోర్టుతో అతడు బిగ్ బాస్ ఆరోవారం కెప్టెన్ అయ్యాడు. చివరకు పోటీలో నిలిచిన రోహిత్‌కు పెద్దగా మద్దతు రాలేదు.

<p>బిగ్‌బాస్ ఆరో వారం కెప్టెన్‌గా ఆర్జే సూర్య</p>
బిగ్‌బాస్ ఆరో వారం కెప్టెన్‌గా ఆర్జే సూర్య

Bigg Boss 6 Telugu, Episode 41: బిగ్‌బాస్ షోలో శుక్రవారం ఎపిసోడ్ కాస్త ఫర్వాలేదనిపించింది. ఇప్పటికే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ముగియడంతో బిగ్‍‌బాస్ ఆరో వారం కెప్టెన్ కోసం మరో టాస్క్ నిర్వహించారు. తమ కొత్త కెప్టెన్‌ను ఎంచుకునే బాధ్యత బిగ్‌బాస్ మరోసారి హౌస్ మేట్స్ చేతికే ఇచ్చాడు. ఇందులో ఎక్కువ మంది సభ్యుల మద్ధతుతో సూర్య కెప్టెన్‌గా అవతరించాడు. మరోపక్క కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అయిన బ్యాటరీ రీచార్జ్‌లో వరుసగా రెండు వారాల పాటు నామినేషన్‌ను తీసుకున్న రోహిత్ త్యాగాన్ని ఇంటి సభ్యులు గాలికొదిలేశారు. కనీసం అతడికి ఫోన్ మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వకపోగా.. కనీసం కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. దీంతో అతడిపై ప్రజల్లో సానుభూతి పెరగనుంది.

ఎపిసోడ్ ప్రారంభంలోనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో సుదీప బంతిని తీసుకుని తన బాస్కెట్‌లో కాకుండా రోహిత్ బాస్కెట్‌లో వేసింది. దీంతో అతడు కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచాడు. దీంతో బంతి కోసం చివర వరకు పోరాడిన ఫైమా, కీర్తి.. సూదీపై ఫుల్ అప్సట్ అయ్యారు. ఇది ఫెయిర్ గేమ్ కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోహిత్‌కు సుదీప, బాలాధిత్య సపోర్ట్ చేస్తుంటే.. తన ఫ్రెండ్సయిన ఇనాయ, సూర్య, రాజ్ తనకు సాయం చేయడానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోహిత్ స్నేహితులు పిలవకున్నా వచ్చి సాయం చేశారు.. నా ఫ్రెండ్స్ పిలిచినా సపోర్ట్ చేయలేదు అంటూ ఇనాయ, సూర్యపై కోపగించుకుంది.

కెప్టెన్సీ టాస్క్ షురూ..

అనంతరం కెప్టెన్సీ పోటీదారులైన రేవంత్, శ్రీసత్య, ఆదిరెడ్డి, రాజ్, అర్జున్, రోహిత్, సూర్య, వాసంతిలకు బిగ్‌బాస్ ఆఖరి వరకు ఆగని పరుగు అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో పూలకుండీల మీద కంటెండర్ల ఫొటోలు అతికించి ఉంటాయి. బజర్ మోగినప్పుడు పోటీదారులు వారి పూలకుండీ కాకుండా ఇతరులది తీసుకుని కంటెండర్ జోన్‌లోకి వెళ్లాలి. చివరగా కంటెండర్ జోన్‌లోకి వెళ్లిన పోటీదారులతో పాటు, అతడి చేతిలో ఏ సభ్యుడి పూలకుండీ అయితే ఉంటుందో ఆ ఇద్దరిలో నుంచి ఒకరిని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించే బాధ్యత ఇంటి సభ్యులకు అప్పగించారు బిగ్‌బాస్.

వాసంతి ఫ్రస్ట్రేషన్..

మొదటి రౌండులో రాజ్ తన పూలకుండీ తానే తెచ్చుకుని కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నాడు. అనంతరం చివరగా వచ్చిన వాసంతి.. ఆదిరెడ్డి పూలకుండీ తీసుకురావడంతో ఆ ఇద్దరిలో ఎవరు కెప్టెన్ కాకూడదని అనుకుంటున్నారో ఇంటి సభ్యులు నిర్ణయించారు. ముందుగా ఆదిరెడ్డి.. ఇంతకుముందు కెప్టెన్ అయినప్పుడు నాగార్జున గారు నన్ను ఏం పీకలేదన్నారు.. ఈ సారి అవకాశం వస్తే పీకి చూపిద్దామని అనుకుంటున్నా. అంటూ తనెందుకు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాడో హౌస్ మేట్స్‌కు తెలియజేశాడు. మరోపక్క వాసంతి నాకు ఇంత వరకు అవకాశం రాలేదని, ఛాన్స్ ఇస్తే నేనూ నిరూపించుకుంటానని తెలిపింది.అయ్యో పాపం అని ఇస్తే దానికి అర్థం లేదని, కష్టపడేవారికి లక్ ఫేవర్ చేస్తుందని, తక్కువ ప్రయత్నం చేసేవారికి ఎలాంటి లక్ ఉండదని ఆదిరెడ్డి వాదించారు. అయ్యో పాపం అని ఎలా అంటారు అంటూ వాసంతి అతడిపై సీరియస్ అయింది. అనంతరం హౌస్ మేట్స్ కూడా ఇద్దరిలో ఆదిరెడ్డికే ఓటేయడంతో వాసంతి కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకుంది. తనను ఎంచుకోవడంపై ఆమె కాస్త ఫ్రస్టేషన్ అయింది.

సంచాలక్‌గా ఫైమా కరెక్టేనా?

వాసంతి తర్వాత రేవంత్, అర్జున్, శ్రీసత్య, ఆదిరెడ్డి వరుసగా గేమ్ నుంచి వైదొలిగారు. కంటెండర్లు ఒక పూలకుండీని మాత్రమే తీసుకుని రావాలని సంచాలకులుగా ఉన్న ఫైమా చెప్పిందని, అయితే సూర్య రెండు పూలకుండీలు తీసుకురావడం వల్ల తనకు దొరకలేదని అందువల్లే తాను చివర రావాల్సి వచ్చిందని సంచాలకులుగా ఉన్న ఫైమాను రేవంత్ అడుగుతాడు. ఇందుకు సూర్య.. అక్కడ ఒకదాంట్లోనే ఎక్కువ పూలకుండీలు ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అయ్యానని, కావాలని తీసుకురాలేదని బదులిచ్చాడు. అలా ఎవరు పెట్టారని రేవంత్ అడుగ్గా.. తానే పెట్టినట్లు ఫైమా బదులిస్తుంది. అలా చేయడం కరెక్ట్ కాదు కదా.. మీరు చేసిన పొరపాటు వల్ల తాను బయట ఉన్నానంటూ ఫైమాపై సీరియస్ అవుతుంది. ఇందుకు ఫైమా తను చేసిన తప్పు తాను సమర్థించుకుంది. కంటెండర్ జోన్‌లో ఎవరైతే ఒక పూలకుండీతో ముందు వస్తారో వారు అర్హులవుతారని తాను చెప్పినట్లు మాట మార్చింది ఫైమా.

దీనిపై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. తప్పు లేకుండా కావాలని ట్రిగ్గర్ చేస్తున్నాడని ఫైమా ఆరోపించింది. ఇద్దరి మధ్య ఇక్కడ వాదన జరుగుతుంది. వీకెండ్‌లో చూసుకుందామని రేవంత్ చెప్పడంతో పైమా కూడా అందుకు చూసుకుందాం అంటూ వెటకారంగా సమాధానం చెబుతుంది. సంచాలక్ అయి ఉండి హౌస్ మేట్స్‌తో గేమ్ ఆడించాల్సింది పోయి.. ఫైమా తానే గేమ్ ఆడటం గమనించద్గ విషయం.

కెప్టెన్‌గా ఆర్జే సూర్య..

అందరూ ఒకరు తర్వాత అనర్హత సాధించిన తర్వాత చివరకు పోటీలో సూర్య, రోహిత్ మిగులుతారు. మెజార్టీ ఇంటి సభ్యులతో పాటు మెరీనా కూడా సూర్యకే ఓటేసింది. చివరకు ఇనాయాకు ఓటేసే వంతు రాగా నా ఓటు బ్రోకా? బావకా? అని తెగ మెలికలు తిరిగింది. అయినా అందరూ ఊహించినట్లుగానే సూర్యకే మద్దతు ఇచ్చింది. చివరకు సూర్య కెప్టెన్ అవుతాడు. రాజు ఎక్కడున్నా రాజుగానే ఉంటాడు అని చెబుతూ హౌస్ మేట్స్ అతడికి మద్దతు ఇచ్చారు. సూర్య కూడా బాహుబలితో ప్రభాస్ వాయిస్‌తో ప్రమాణస్వీకారం చేయడంతో ఫన్ క్రియేట్ అయింది. కెప్టెన్సీ టాస్క్ అనంతరం రోహిత్-మెరీనా ఉత్తరాది పర్వదినమైన కర్వా చౌత్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇద్దరూ సంప్రదాయ దుస్తులను ధరించారు. అనంతరం మెరీనా జల్లెడలో భర్త రోహిత్‌ను చూసింది. అనంతరం భర్త పాదాలు తాకి అతడి ఆశీర్వాదం తీసుకుంది. బిగ్‌బాస్ బాలీవుడ్ సాంగ్ వేయడంతో ఇంటి సభ్యులంతా డ్యాన్స్ వేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం