Shakini Dakini OTT Release Date: ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి శాకిని డాకిని-regina nivetha thomas shakini dakini ott release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Regina Nivetha Thomas Shakini Dakini Ott Release Date Locked

Shakini Dakini OTT Release Date: ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి శాకిని డాకిని

Nelki Naresh Kumar HT Telugu
Sep 29, 2022 02:21 PM IST

Shakini Dakini OTT Release Date: శాకిని డాకిని సినిమా ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ది. రెజీనా,నివేథా థామ‌స్ న‌టించిన ఈ సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే...

రెజీనా,నివేథా థామ‌స్
రెజీనా,నివేథా థామ‌స్ (Twitter)

Shakini Dakini OTT Release Date: రెజీనా(Regina) , నివేథా థామ‌స్(Nivetha Thomas) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన శాకిని డాకిని సినిమా సెప్టెంబ‌ర్ 16న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. కొరియ‌న్ చిత్రం మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్ ఆధారంగా ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న షాలిని, దామిని అనే ఇద్ద‌ర‌మ్మాయిలు ప్ర‌మాద‌క‌ర‌మైన హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ముఠాను ఎలా ఎదుర్కొన్నార‌నే క‌థాంశంతో కామెడీ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందింది. ప్రేక్ష‌కుల్ని న‌వ్వించ‌డంతో పాటు థ్రిల్‌ను పంచ‌డంలో విఫ‌ల‌మైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌గా మిగిలిపోయింది.

థియేట‌ర్ల‌లో విడుద‌లైన ప‌దిహేను రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్న‌ది. సెప్టెంబ‌ర్ 30 (రేపు)నుంచి శాకిని డాకిని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. గురువారం రోజు ఓటీటీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఓటీటీ కోస‌మే ఈ సినిమాను రూపొందించిన‌ట్లు స‌మాచారం. ఆ త‌ర్వాత ఆలోచ‌న‌ను మార్చుకున్న నిర్మాతలు థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసిన‌ట్లు తెలిసింది. రిలీజ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మాత‌లు ఓటీటీ డీల్ కుదుర్చుకున్న‌ట్లు చెబుతున్నారు.

సురేష్ ప్రొడ‌క్ష‌న్‌తో క‌లిసి సునీత తాటి ఈ సినిమాను నిర్మించింది. వ‌కీల్ సాబ్ త‌ర్వాత నివేథా థామ‌స్ న‌టించిన సినిమా ఇది. రెజీనా కూడా చాలా రోజుల త‌ర్వాత తెలుగులో చేసిన సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

IPL_Entry_Point