Dhamaka vs 18 Pages 1st Week Collection: ధ‌మాకా vs 18 పేజెస్ - ర‌వితేజ‌, నిఖిల్ సినిమాల ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ ఎంతంటే-raviteja dhamaka nikhil 18 pages 1st week worldwide box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhamaka Vs 18 Pages 1st Week Collection: ధ‌మాకా Vs 18 పేజెస్ - ర‌వితేజ‌, నిఖిల్ సినిమాల ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ ఎంతంటే

Dhamaka vs 18 Pages 1st Week Collection: ధ‌మాకా vs 18 పేజెస్ - ర‌వితేజ‌, నిఖిల్ సినిమాల ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ ఎంతంటే

Nelki Naresh Kumar HT Telugu
Dec 30, 2022 12:28 PM IST

dhamaka vs 18 pages 1st week collection: ర‌వితేజ ధ‌మాకా, నిఖిల్ 18 పేజెస్ సినిమాలు ఫ‌స్ట్ వీక్‌ను పూర్తి చేసుకొని రెండో వారంలోకి అడుగుపెట్టాయి. తొలి వారంలో ఈ సినిమాకు వ‌చ్చిన వ‌సూళ్లు ఎంతంటే...

ర‌వితేజ
ర‌వితేజ

dhamaka vs 18 pages 1st week collection: గ‌త వారం బాక్సాఫీస్ వ‌ద్ద ర‌వితేజ ధ‌మాకా, నిఖిల్ 18 పేజెస్ సినిమాలు పోటీప‌డ్డాయి. మాస్ క‌థాంశంతో ర‌వితేజ ధ‌మాకా రూపొంద‌గా క్లాస్ ల‌వ్‌స్టోరీగా నిఖిల్ 18 పేజెస్ తెర‌కెక్కింది. ఈ రెండు సినిమాల మ‌ధ్య పోటీ టాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది.

ఫ‌స్ట్ వీక్‌లో ర‌వితేజ ధ‌మాకా సినిమా 62 కోట్ల కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ర‌వితేజ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 19 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

20 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా ఉండ‌గా నాలుగు రోజుల్లోనే ఆ ల‌క్ష్యాన్ని చేరుకుంది. తొలి వారంలోనే నిర్మాత‌ల‌కు ఈ సినిమా ఆరు కోట్ల వ‌ర‌కు లాభాల‌ను తెచ్చిపెట్టిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో ర‌వితేజ‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించాడు.

నిఖిల్ 18 పేజెస్ సినిమాకు టాక్ బాగున్నా క‌లెక్ష‌న్స్ మాత్రం ధ‌మాకా కంటే త‌క్కువ‌గా వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫ‌స్ట్ వీక్‌లో దాదాపు 25 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు చెబుతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 12 వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం బ్రేక్ ఈవెన్‌కు చేరువ‌లో 18 పేజెస్ సినిమా ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ వారం పెద్ద సినిమాలు పోటీగా లేక‌పోవ‌డం ధ‌మాకా, 18 పేజెస్ సినిమాల‌కు క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. 18 పేజెస్ సినిమాకు అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ క‌థ‌ను అందించ‌గా ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

IPL_Entry_Point