Rani Mukerji on Shah rukh: 80 ఏళ్లు వచ్చినా షారుఖ్‌తో రొమాన్స్ చేస్తాను.. బాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్-rani mukerji says she would love to romance shah rukh khan till 80 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rani Mukerji Says She Would Love To Romance Shah Rukh Khan Till 80

Rani Mukerji on Shah rukh: 80 ఏళ్లు వచ్చినా షారుఖ్‌తో రొమాన్స్ చేస్తాను.. బాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Maragani Govardhan HT Telugu
Apr 06, 2023 07:50 AM IST

Rani Mukerji on Shah rukh: బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రాణి ముఖర్జీ.. షారుఖ్ ఖాన్ గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. అతడితో నటించడం తనకెంతో ఇష్టమని.. తనకు 80 ఏళ్లు వచ్చినా షారుఖ్‌తో రొమాన్స్ చేయడాన్ని ఇష్టపడతానని స్పష్టం చేసింది.

రాణి ముఖర్జీ-షారుఖ్ ఖాన్
రాణి ముఖర్జీ-షారుఖ్ ఖాన్

Rani Mukerji on Shah rukh: బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీకి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమితమైన ఇష్టం. సినిమాల్లోకి రాకముందు నుంచే అతడి అభిమాని అయిన ఆమె.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ జోడీగా గుర్తింపు తెచ్చుకుంది వీరి పెయిర్. కుచ్ కుచ్ హోతా హై, కబీ అల్విదా నా కెహ్నా, చల్తే చల్తే, పహేలీ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో వీరు ప్రేక్షకులను అలరించారు. షారుఖ్‌పై అభిమానాన్ని పలుమార్లు చూపించిన రాణి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్ చేసింది. తనకు 80 ఏళ్ల వచ్చినా షారుఖ్‌తో రొమాన్స్ చేయడాన్ని ఇష్టపడతానని స్పష్టం చేసింది.

రాణి ముఖర్జీ నటించిన మిసెస్ ఛటర్జి vs నార్వే అనే సినిమా ఇటీవలే విడుదలే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాపై తన స్పందనను తెలియజేస్తూ.. రాణి ముఖర్జిని ప్రశంసలతో ముంచెత్తాడు షారుఖ్. "మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే టీమ్ ఎంతో అద్భుతమైన ఎఫర్ట్ చేసింది. నా రాణి .. క్వీన్‌లా ప్రధాన పాత్రలో మెరిసింది. దర్శకురాలు ఆషిమా సున్నితత్వంతో కూడిన మానవ పోరాటాన్ని చూపించారు." అని షారుఖ్ ట్వీట్ చేశారు.

షారుఖ్ ప్రశంసల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాణి ముఖర్జీని అడుగ్గా.. కింగ్ ఖాన్‌తో కలిసి మళ్లీ నటించాలనుందని తన మనస్సులో కోరిక బయటకు చెప్పింది. "రచయితల్లారా దయచేసి షారుఖ్‌ కోసం అద్భుతమైన మెచ్యూర్ ప్రేమ కథ రాయండి. నేను ఎస్‌ఆర్‌కేతో రొమాన్స్ చేయడాన్ని ఎప్పుడూ ఇష్టపడతాను. మా ఇద్దరి వయసు పెరిగినా ఇదే ఫీలింగ్ ఉంటుంది. నాకు 80 ఏళ్లు వస్తే.. అతడికి 95 ఏళ్లు వస్తాయి. అప్పుడు కూడా అతడితో రొమాన్స్ చేయాలనుకుంటున్నాను." అని రాణి ముఖర్జీ స్పష్టం చేసింది.

షారుఖ్ చివరగా పఠాన్‌లో నటించారు. ఈ సినిమా జనవరి 25న విడుదలై సూపర్ సక్సెస్‌ను అందుకుంది. అతడు ప్రస్తుతం జవాన్, దున్కీ అనే ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. మరోపక్క రాణి ముఖర్జీ మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సక్సెస్‌తో ఫుల్ ఖుషీగా ఉంది. ఇందుకోసం ముంబయిలో సక్సెస్ పార్టీ కూడా చేయాలనుకుంటోంది. మరి ఈ పార్టీకి షారుఖ్‌ను ఆహ్వానిస్తుందో లేదో వేచిచూడాలి.

IPL_Entry_Point

టాపిక్