Pathaan OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తోన్న షారుఖ్‌ఖాన్ పఠాన్ - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Pathaan OTT Release Date: వెండితెరపై కలెక్షన్ల వర్షం కురిపించిన షారుఖ్‌ఖాన్ పఠాన్ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే...
Pathaan OTT Release Date: షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన పఠాన్ మూవీ బాలీవుడ్ గత రికార్డులను తిరగరాసింది. హిందీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. సిల్వర్‌స్క్రీన్‌పై ప్రభంజనాన్ని సృష్టించిన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నది.
ట్రెండింగ్ వార్తలు
మార్చి 22న నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. పఠాన్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దాదాపు వంద కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. బాలీవుడ్‌తో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్ పఠాన్ అనే రా ఏజెంట్‌గా కనిపించాడు. ఇండియాపై శత్రుదేశం తలపెట్టిన ఓ సీక్రెట్ మిషన్‌ను పఠాన్ ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ. ఇందులో జాన్ అబ్రహమ్ విలన్‌గా నటించాడు.
యాభై రోజుల్లో 1000 కోట్లు
పఠాన్ సినిమా యాభై రోజుల్లో 1043 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇండియాలో 650 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఓవర్‌సీస్‌లో 393 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. అత్యధిక వసూళ్లను రాబట్టిన బాలీవుడ్ సినిమాగా పఠాన్ రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్‌ఖాన్ నటించిన సినిమా ఇది.